శ్రీలంక హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే ఇది ఢిల్లీ కాదు. మాస్కుల అవసరం కూడా లేదు. చక్కగా కునుకూ తీయొచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లి విశ్రాంతిలో ఉన్నాడు కాబట్టి. అతనుంటే ఇంకెంత వీర బాదుడు బాదుతాడో, ఇంకెన్ని రికార్డులు చెరిపేస్తాడోననే బెంగ ఉండేది. దీంతో లంక ఇప్పుడు కాస్త ఉపశమనంతో... కలిసి రావాలనే అదృష్టంతో బరిలోకి దిగొచ్చు.