భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఢాకాలోకి షేర్ ఏ బంగ్లా స్టేడియం వేదికగా రేపు (డిసెంబర్ 4) ఉదయం 11:30 గంటలకు తొలి వన్డే జరుగనుంది. న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న టీమిండియా సీనియర్లు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనుండటంతో తుది జట్టు ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ముఖ్యంగా రేపటి వన్డేలో పంత్ ఆడబోతున్నాడా లేదా అన్న అంశంపై టీమిండియా అభిమానుల మధ్య భారీ డిస్కషన్ నడుస్తుంది. మరోవైపు సీనియర్లను కాదని జూనియర్లలో ఎవరికైనా ఛాన్స్ దొరుకుందా అన్న చర్చ సైతం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో రేపటి వన్డేలో భారత తుది జట్టు కూర్పుపై విశ్లేషకులు తమ అంచనాలను వెల్లడించారు.
విశ్లేషకుల అంచనా మేరకు.. సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్‌లు చాలా తక్కువనే చెప్పాలి. రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ సేన్ అవకాశం కోసం వెయిట్ చేయక తప్పదని కచ్చితంగా తెలుస్తోంది. న్యూజిలాండ్ టూర్‌లో దారుణంగా విఫలమైన శార్దూల్ ఠాకూర్ సైతం అవకాశం కోసం వేచి చూడాల్సి ఉంటుంది.
పోతే మిగిలింది ఇషాన్ కిషన్. జట్టులో రిషబ్ పంత్ ఉండగా, ఇషాన్‌ను తుది జట్టులో ఆడించే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ బరిలోకి దిగడం ఖాయం కాగా, వన్ డౌన్‌లో కోహ్లి, నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్, ఐదో ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్, ఆరో స్థానంలో రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ల కోటాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, పేసర్లుగా మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ బరిలోకి దిగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
Comments
Please login to add a commentAdd a comment