
దీటుగా బదులిస్తున్న ఆసీస్
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది
పెర్త్: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా విసిరిన 310 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ అందుకు దీటుగా బ్యాటింగ్ చేస్తోంది. బెయిలీ(86 నాటౌట్;91 బంతుల్లో 6ఫోర్లు,2 సిక్సర్లు), స్మిత్(70 నాటౌట్;68 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా చేయడంతో ఆసీస్ 30 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
అంతకుముందు అరోన్ పించ్(8), డేవిడ్(5) లు ఆదిలోనే అవుటైనా.. బెయిలీ-స్మిత్ జోడీ 160పరుగులకు పైగా అజేయ భాగస్వామ్యం సాధించడంతో ఆసీస్ తేరుకుంది. భారత బౌలర్లలో బరిందర్ శరణ్ కు రెండు వికెట్లు లభించాయి.