తొలి వన్డేలో భారత్ విజయలక్ష్యం 189 పరుగులే...దీనిని చూస్తే ఛేదన చాలా సులువనిపించింది. కానీ ఒక దశలో స్కోరు 16/3 కాగా, ఆపై 39/4కు మారింది...ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై భారత బ్యాటర్లు శ్రమించాల్సి వచ్చింది.
చివరకు రాహుల్, జడేజా శతక భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ఎనిమిది నెలల తర్వాత ఆడిన తొలి వన్డేలో జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శన నమోదు చేయగా, టెస్టుల్లో బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ వన్డేల్లో తానేంటో చూపించాడు. అంతకు ముందు భారత బౌలర్లు ఆసీస్‌ను కట్టి పడేశారు. మిచెల్ మార్‡్ష మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన జట్టు భారీ స్కోరు చేసేందుకు సరిపోలేదు.
ముంబై: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్‡్ష (65 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం భారత్ 39.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (69 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు) ఆరో వికెట్‌కు అభేద్యంగా 108 పరుగులు జత చేశారు. 2 వికెట్లు, 1 కీలక క్యాచ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించిన జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా... ఈ నెల 19న వైజాగ్‌లో రెండో వన్డే జరుగుతుంది.
మార్‡్ష మినహా...
తన తొలి ఓవర్లోనే ట్రవిస్ హెడ్ (5)ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం లభించలేదు. అయితే మార్‡్ష దూకుడుగా ఆడి జట్టును నడిపించాడు. సిరాజ్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన మార్‡్ష, సిరాజ్ మరో ఓవర్లోనే రెండు ఫోర్లు బాదాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 59 పరుగులకు చేరింది. మార్‡్షకు సహకరించిన స్టీవ్ స్మిత్ (22)ను కీపర్ రాహుల్ చక్కటి క్యాచ్‌తో వెనక్కి పంపడంతో 72 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మార్‡్ష 51 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి అతను తన జోరును కొనసాగించాడు.
అయితే జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మార్‡్ష షార్ట్ థర్డ్‌మాన్ వద్ద సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. మార్‡్ష, లబుషేన్ (15) మూడో వికెట్‌కు 52 పరుగులు జత చేశారు. అంతే...ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. 20వ ఓవర్లో 129/2తో మెరుగైన స్థితిలో నిలిచిన ఆ జట్టు 36వ ఓవర్ కూడా ముగియక ముందే ముగిసింది. 59 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 8 వికెట్లు కోల్పోయింది. తన చివరి 14 బంతుల్లో షమీ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టగా...సిరాజ్ తన చివరి 10 బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వకుండా 2 వికెట్లు తీశాడు.
శతక భాగస్వామ్యం...
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఆరంభంలో భారత్ తడబడింది. ఇషాన్ కిషన్ (3) తనకు లభించిన అరుదైన అవకాశాన్ని వృథా చేసుకోగా... స్టార్క్ వరుస బంతుల్లో కోహ్లి (4), సూర్యకుమార్ (0)లను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. వ్యక్తిగత స్కోర్ల 2, 7 వద్ద ఇన్‌గ్లిస్, స్మిత్ క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన శుబ్‌మన్ గిల్ (20) దానిని ఉపయోగించుకోలేకపోయాడు.
ఈ దశలో రాహుల్, హార్దిక్ పాండ్యా (25) కలిసి జట్టును ఆదుకున్నారు. అయితే స్టొయినిస్ బౌన్సర్‌తో పాండ్యాను అవుట్ చేయడంతో 44 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. విజయానికి మరో 106 పరుగులు చేయాల్సిన ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాదే పైచేయిగా మారినట్లు అనిపించింది. కానీ రాహుల్, జడేజా జోడి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ వీరిద్దరు పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 73 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.
స్కోరు వివరాలు:
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) సిరాజ్ 5; మార్‡్ష (సి) సిరాజ్ (బి) జడేజా 81; స్మిత్ (సి) రాహుల్ (బి) పాండ్యా 22; లబుషేన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 15; ఇన్‌గ్లిస్ (బి) షమీ 26; గ్రీన్ (బి) షమీ 12; మ్యాక్స్‌వెల్ (సి) పాండ్యా (బి) జడేజా 8; స్టొయినిస్ (సి) గిల్ (బి) షమీ 5; అబాట్ (సి) గిల్ (బి) సిరాజ్ 0; స్టార్క్ (నాటౌట్) 4; జంపా (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (35.4 ఓవర్లలో ఆలౌట్) 188.
వికెట్ల పతనం: 1–5, 2–77, 3–129, 4–139, 5–169, 6–174, 7–184, 8–184, 9–188, 10–188.
బౌలింగ్: షమీ 6–2–17–3, సిరాజ్ 5.4–1–29–3, పాండ్యా 5–0–29–1, శార్దుల్ 2–0–12–0, జడేజా 9–0–46–2, కుల్దీప్ 8–1–48–1.
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) స్టొయినిస్ 3; గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 20; కోహ్లి (ఎల్బీ) (బి) స్టార్క్ 4; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; రాహుల్ (నాటౌట్) 75; పాండ్యా (సి) గ్రీన్ (బి) స్టొయినిస్ 25; జడేజా (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (39.5 ఓవర్లలో 5 వికెట్లకు) 191.
వికెట్ల పతనం: 1–5, 2–16, 3–16, 4–39, 5–83.
బౌలింగ్: స్టార్క్ 9.5–0– 49–3, స్టొయినిస్ 7–1–27–2, అబాట్
9–0–31–0, గ్రీన్ 6–0–35–0, జంపా 6–0–37–0, మ్యాక్స్‌వెల్ 2–0–7–0.
Comments
Please login to add a commentAdd a comment