IND vs AUS 3rd Test Day 4 live updates and highlights: బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది.
ఫాలో ఆన్ గండం గట్టెక్కిన భారత్
బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. టెయిలాండర్లు ఆకాష్ దీప్(27 బ్యాటింగ్), జస్ప్రీత్ బుమ్రా(10 బ్యాటింగ్) అద్బుతమైన పోరాటంతో భారత్‌ను మ్యాచ్‌లో నిలిపారు. పదో వికెట్‌కు వీరిద్దరూ 39 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
వెలుతురు లేమి కారణంగా నాలుగో రోజు ఆటను 14 ఓవర్ల ముందే అంపైర్‌లు నిలిపేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులుచేసింది. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులు వెనకంజలో ఉంది. భారత ఫాలో ఆన్ తప్పించుకోవడంలో వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్(84), జడేజా(10) కీలక పాత్ర పోషించారు.
జడ్డూ అవుట్
కేఎల్ రాహుల్(84) మినహా స్పెషలిస్టు బ్యాటర్లంతా విఫలమైన వేళ టీమిండియాను ఆదుకున్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌కు తెరపడింది. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమిన్స్ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి జడ్డూ వెనుదిరిగాడు. దీంతో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా స్కోరు: 215/9 (66.2). ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 30 రన్స్ చేయాలి.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్
సిరాజ్ (1) రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి సిరాజ్ పెవిలియన్ చేరాడు. బుమ్రాక్రీజులోకి వచ్చాడు.
భారత్ ఏడో వికెట్ డౌన్
నితీశ్ రెడ్డి రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన నితీశ్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 52 పరుగులు కావాలి. ప్రస్తుతం భారత్ స్కోర్: 194/7
10:45 AM: మొదలైన ఆట
వర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది.
09:53 AM: వర్షం వల్ల మరోసారి ఆగిన ఆట
టీమిండియా స్కోరు: 180/6 (51.5)
జడేజా 52, నితీశ్ రెడ్డి 9 పరుగులతో ఉన్నారు
జడేజా హాఫ్ సెంచరీ..
బ్రిస్బేన్ టెస్టులో రవీంద్ర జడేజా కీలక హాఫ్ సెంచరీ సాధించాడు. 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(50)తో పాటు నితీశ్(8) పరుగులతో ఉన్నారు.
వరుణుడు ఎంట్రీ.. నిలిచిన పోయిన ఆట
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట నిలిచిపోయింది. లంచ్ విరామం తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో ఆట ఇంకా ప్రారంభం కాలేదు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
లంచ్ బ్రేక్‌కు భారత్ స్కోర్: 167/6
లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఫాల్ ఆన్ గండం దాటాలంటే భారత్ ఇంకా 79 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో రవీంద్ర జడేజా(41), నితీశ్ కుమార్(7) పరుగులతో ఉన్నారు.
కేఎల్ రాహుల్ ఔట్..
కేఎల్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 84 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. నాథన్ లియోన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు.
సెంచరీ దిశగా కేఎల్ రాహుల్..
42 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(26) నిలకడగా ఆడుతున్నారు.
నిలకడగా ఆడుతున్న రాహుల్, జడేజా..
34 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(76), రవీంద్ర జడేజా(10) నిలకడగా ఆడుతున్నారు. భారత్ ఇంకా 328 పరుగులు వెనకబడి ఉంది.
రోహిత్ శర్మ ఔట్...
నాలుగో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(10) వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు.
మూడో రోజు ఆట ఆరంభం..
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను ప్యాట్ కమ్మిన్స్ ప్రారంభించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(34), రోహిత్ శర్మ(0) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment