ట్రోఫీతో కమిన్స్- రాహుల్ (PC: BCCI)
Australia tour of India, 2023- India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొహాలీలో గల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో లక్ష్య ఛేదనకు దిగిన జట్లే.. మెజారిటీ విజయాలు సాధించిన నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.
అయ్యర్, అశ్విన్ వచ్చేశారు
ప్రపంచంలోని మేటి జట్టైన ఆసీస్‌తో పోరు సవాలుతో కూడుకున్నదని.. అయితే చాలెంజ్‌లు స్వీకరించడం తమకు ఇష్టమేనని పేర్కొన్నాడు. గాయం కారణంగా ఆసియా కప్-2023 మ్యాచ్‌లకు దూరమైన శ్రేయస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చాడన్న రాహుల్.. ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టుకు ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు.
ప్రపంచకప్‌నకు ముందు ఇరు జట్ల సవాలు
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి ముందు ఇరు జట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆసియా వన్డే కప్-2023 గెలిచి జోరు మీదున్న టీమిండియా ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌నూ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో ఐసీసీ ఈవెంట్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది.
మొహాలీలో మనకు చేదు అనుభవం
మరోవైపు.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన కంగారూలు భారత గడ్డపై సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఇక తొలి వన్డేకు వేదికైన మొహాలీ స్టేడియంలో మాత్రం ఆస్ట్రేలియాదే పైచేయి. ఇప్పటి వరకు ఇక్కడ భారత్‌తో నాలుగు వన్డేలు ఆడగా నాలుగింట కంగారూ జట్టే జయభేరి మోగించింది. మరి రాహుల్ సేన ఈసారి ఆ అపవాదును చెరిపేస్తుందేమో చూడాలి!
తుది జట్లు ఇవే:
టీమిండియా:
శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్:
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా.
చదవండి: వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. ఎవరూ ఊహించని ఆటగాళ్లు ఎంట్రీ
#TeamIndia all set to take on Australia in the 1st ODI in Mohali.#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/N1vMI2m88e
— BCCI (@BCCI) September 22, 2023
𝗙𝗼𝗿 𝗺𝗲, 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗶𝘀 𝘃𝗲𝗿𝘆 𝗰𝗹𝗼𝘀𝗲 𝘁𝗼 𝗺𝘆 𝗵𝗲𝗮𝗿𝘁 🙌
— BCCI (@BCCI) September 22, 2023
An excited @ashwinravi99 speaks about trying to push barriers, taking pride in performance & enjoying the game 👌👌 - By @28anand
Full Interview 🎥🔽 #TeamIndia | #INDvAUS
Comments
Please login to add a commentAdd a comment