రాస్ టేలర్
హామిల్టన్: రాస్ టేలర్ (113; 12 ఫోర్లు) అద్భుత శతకానికి సాన్‌ట్నర్ (27 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు తోడవడంతో... ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు 3 వికెట్లతో విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బట్లర్ (79; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), జో రూట్ (71; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం లభించలేదు. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో టేలర్, లాథమ్ (79; 6 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 178 పరుగులు జోడించారు. చివర్లో సాన్‌ట్నర్ మెరవడంతో విజయం సొంతమైంది. నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగిన వివాదాస్పద ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (2/43) బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్లు మధ్య రెండో వన్డే బుధవారం మౌంట్‌మాంగనీలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment