Kohli Surpasses Sachin Tendulkar: రికార్డుల రారాజుగా పేరున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లి.. బోలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో మరో రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. వన్డే ఫార్మాట్‌లో విదేశాల్లో సచిన్ 5065 పరుగులు చేయగా, ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆ మార్కును దాటాడు. తద్వారా విదేశాల్లో(వన్డేల్లో) అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment