ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం మూడు జట్ల మధ్య దోబూచులాడుతుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ముందు టాప్ ప్లేస్ పాకిస్తాన్, భారత్, ఆస్ట్రేలియా జట్లతో మ్యూజికల్ ఛైర్స్ గేమ్ ఆడుతుంది. ఈ మూడు జట్లలో ఒక్కో జట్టు ఒక్కో రోజు అగ్రస్థానంలో ఉంటుంది. ఈ నెలలో ఏ జట్టు వరుసగా ఓ వారం పాటు టాప్ ప్లేస్‌లో లేదు. మూడు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం ఒకటి, అర ఉండటమే ఈ దోబూచులాటకు కారణం.
సెప్టెంబర్ 14న అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాతో ఐదో వన్డేలో ఓటమిపాలు కావడంతో తమ అగ్రపీఠాన్ని పాక్‌కు చేజార్చుకుంది. పాక్.. ఆసియా కప్-2023లో సూపర్ ఫోర్ దశలోనే నిష్క్రమించినా తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇదే సమయంలో టీమిండియా ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నా.. సూపర్ ఫోర్ దశలో బంగ్లాదేశ్‌తో చేతిలో ఓడిపోవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ప్రస్తుతం భారత్, పాక్‌లకు సమానంగా 115 పాయింట్లు ఉన్నా పాక్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 113 పాయింట్లు కలిగి ఉంది. టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 22న ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. ఇదే గనక జరిగితే టీమిండియా ఒకేసారి మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగే జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది.
భారత్ ప్రస్తుతం టెస్ట్, టీ20ల్లో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఆసీస్‌తో సిరీస్‌ను భారత్ గెలిస్తే అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో ఉన్న జట్టుగా ప్రపంచకప్ బరిలోకి దిగుతుంది. కాగా, ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్‌కప్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 14న భారత్.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment