ఐసీసీ మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. టీమిండియాను వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది.
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 టైటిల్ గెలిచిన కంగారూ జట్టు 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రన్నరప్ టీమిండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఇక ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయినా వన్డే, టీ20లలో మాత్రం టాప్ ర్యాంకు పదిలంగా ఉంది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ సేన ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-5
1. ఆస్ట్రేలియా- 124 రేటింగ్ పాయింట్లు
2. ఇండియా- 120 రేటింగ్ పాయింట్లు
3. ఇంగ్లండ్- 105 రేటింగ్ పాయింట్లు
4. సౌతాఫ్రికా- 103 రేటింగ్ పాయింట్లు
5. న్యూజిలాండ్- 96 రేటింగ్ పాయింట్లు.
మెన్స్ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ టాప్-5
1. ఇండియా -122 రేటింగ్ పాయింట్లు
2. ఆస్ట్రేలియా- 116 రేటింగ్ పాయింట్లు
3. సౌతాఫ్రికా- 112 రేటింగ్ పాయింట్లు
4. పాకిస్తాన్- 106 రేటింగ్ పాయింట్లు
5. న్యూజిలాండ్- 101 రేటింగ్ పాయింట్లు
మెన్స్ టీమ్ టీ20 ర్యాంకింగ్స్ టాప్-5
1. ఇండియా- 264 రేటింగ్ పాయింట్లు
2. ఆస్ట్రేలియా- 257 రేటింగ్ పాయింట్లు
3. ఇంగ్లండ్- 252 రేటింగ్ పాయింట్లు
4. సౌతాఫ్రికా- 250 రేటింగ్ పాయింట్లు
5. న్యూజిలాండ్- 250 రేటింగ్ పాయింట్లు
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment