దుబాయ్:చాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా టైటిల్నే ఎగురేసుకుపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ వన్డే ర్యాంకింగ్స్ లో కూడా మరింత పైకి వచ్చింది. ఈ టోర్నీ అనంతంరం సోమవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది.
మరొకవైపు ఫైనల్లో ఓటమి పాలై రన్నరప్ గా సరిపెట్టుకున్న భారత్ జట్టు మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం 95 రేటింగ్ పాయింట్లను సాధించిన పాకిస్తాన్ ఆరో స్థానానికి ఎగబాకింది. ఎనిమిదో స్థానంలో చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమైన పాకిస్తాన్ ఆద్యంతం సంచలన విజయాలు నమోదు చేసి చివరకు టైటిల్ ను ఎగురేసుకుపోయింది.