
విరాట్ కోహ్లి
దుబాయ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో భారత సారథి 928 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ (911) కంటే 17 రేటింగ్ పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో స్మిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 43, 16 పరుగులే చేయడం కోహ్లి ర్యాంకును పదిలం చేసింది. భారత ఆటగాళ్లలో పుజారా (791), రహానే (759)లిద్దరూ వరుసగా నాలుగు, ఆరో స్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల జాబితాలో పేసర్ బుమ్రా ఐదు నుంచి ఆరో స్థానానికి దిగజారాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియన్ సీమర్ కమిన్స్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా రెండో ర్యాంకులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment