top spot
-
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ : టాప్ ర్యాంక్‌లోనే కోహ్లి
దుబాయ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో భారత సారథి 928 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ (911) కంటే 17 రేటింగ్ పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో స్మిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 43, 16 పరుగులే చేయడం కోహ్లి ర్యాంకును పదిలం చేసింది. భారత ఆటగాళ్లలో పుజారా (791), రహానే (759)లిద్దరూ వరుసగా నాలుగు, ఆరో స్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల జాబితాలో పేసర్ బుమ్రా ఐదు నుంచి ఆరో స్థానానికి దిగజారాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియన్ సీమర్ కమిన్స్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా రెండో ర్యాంకులో ఉన్నాడు. -
మరోసారి టాప్‌లో అరుంధతీ భట్టాచార్య
-
మరోసారి టాప్‌లో ఆమె
ముంబై: ప్రభుత్వంరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మరోసారి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. దేశీయ వ్యాపారరంగంలో అత్యంత శక్తిమంతమైన మహిళగా గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాదికిగాను ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 'టాప్ 50 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ 2016' జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో భట్టాచార్య మరోసారి అగ్రస్థానంలో నిలిచారని ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. -
ఈ-కామర్స్‌ల రారాజు ఇదేనట!
బెంగళూరు : భారత ఆన్లైన్ రిటైల్ ఇండస్ట్రీకి రారాజు ఎవరంటూ తరచూ జరిగే చర్చలకు దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ చెక్ పెట్టింది. ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరున్న అమెజాన్ కంటే తానే ఎక్కువగా విక్రయాలు నిర్వహించినట్టు వెల్లడించి, దేశీయ ఈ-కామర్స్ రారాజుగా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించుకుంది. గురువారంతో ముగిసిన బిగ్‌బిలియన్ డేస్ ఫెస్టివల్ అమ్మకాల్లో 15.5 మిలియన్ యూనిట్లను విక్రయించి దేశీయ ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లో టాప్‌లో నిలిచినట్టు వెల్లడించింది. స్మార్ట్ఫోన్లు, టెలివిజన్ విక్రయాలు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే అమ్మకాలకు ఎక్కువగా సహకరించినట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఈ ఈవెంట్ తమకు చాలా ప్రాముఖ్యమైనదని, మరోసారి దేశీయ ఆన్లైన్ మార్కెట్లో తామే రారాజుగా నిరూపించుకోవడానికి ఇది ఎంతో సహకరించిందని ఫ్లిప్‌కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ తెలిపారు. అయితే ఎంతమొత్తానికి ఈ అమ్మకాలు రికార్డు అయ్యాయో వెల్లడించలేదు. గతేడాది కంపెనీ 300 మిలియన్ డాలర్లకు బిగ్ బిలియన్ డే అమ్మకాలు నిర్వహించింది. మొబైల్, లైఫ్‌స్టైల్, అతిపెద్ద ఉపకరణాలపై ఎక్కువగా తాము ఫోకస్ చేశామని, ఈ సమయంలో వీటిని కొనడానికే కస్టమర్లు ఎక్కువగా ఆసక్తిచూపుతారని గుర్తించినట్టు వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా బన్సాల్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మార్కెటింగ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, టెక్నాలజీలల్లో కీలకమైన మార్పులు జరిగి, పోర్టల్,మొబైల్ వెబ్సైట్లలో, అప్లికేషన్లలో ఫ్లిప్‌కార్ట్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. కాగ ప్రత్యర్థి అమెజాన్ నిర్వహించిన గ్రేట్ ఇండియన్ సేల్ విక్రయాలు కేవలం 15 మిలియన్ యూనిట్లకే పరిమితమైనట్టు బుధవారమే ఆ కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఈ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించగా.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు చేపట్టింది. -
మ్యాగీ మళ్లీ టాప్
న్యూఢిల్లీ : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం అనంతరం మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మ్యాగీ నూడుల్స్ మళ్లీ టాప్ స్పాట్‌లోకి వచ్చాయి. ఈ ఏడాది ప్రథమార్థం వరకు 57 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుని మార్కెట్లో తన ఆధిపత్య స్థానాన్ని మ్యాగీ పునరుద్ధరించుకుంది. రీఎంట్రీ ఇచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే 57.1 శాతం మార్కెట్ షేరును మ్యాగీ కైవసం చేసుకోవడంపై నెస్లే ఇండియా ఆనందం వ్యక్తంచేస్తోంది. ఇన్ స్టెంట్ నూడుల్స్ సెగ్మెంట్లో ఆరోగ్యవంతమైందిగా మ్యాగీ నిలుస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలతో పలు రాష్ట్రాలు ఈ ఉత్పత్తులపై నిషేధం విధించాయి. ఇవి క్యాన్సర్ ముప్పుకు దారితీస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఐదు నెలల నిషేధం కాలంలో నెస్లే ఇండియా రూ.500 కోట్లకు పైగా విక్రయాలను కోల్పోవాల్సి వచ్చింది. ల్యాబ్ పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ నాణ్యమైనవేనని తేలడంతో మళ్లీ ఉత్పత్తులను నవంబర్‌లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. నిషేధం అనంతరం మొదటిసారి గత డిసెంబర్లో మ్యాగీకి డిమాండ్ పుంజుకుంది. మార్కెట్లోకి పునఃప్రవేశించిన ఒక నెలలోనే 35.2 శాతం మార్కెట్ షేరు పెంచుకుంది. 2016 మార్చిలోనే ఈ ఇన్ స్టెంట్ నూడుల్స్ 51 శాతం మార్కెట్ షేరును దక్కించుకున్నాయి. -
ఆయుధ దిగుమతుల్లో భారత్ టాప్