ఈ-కామర్స్ల రారాజు ఇదేనట! | Flipkart sells 15.5 million units, claims top spot | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్ల రారాజు ఇదేనట!

Published Fri, Oct 7 2016 9:32 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఈ-కామర్స్ల రారాజు ఇదేనట! - Sakshi

ఈ-కామర్స్ల రారాజు ఇదేనట!

బెంగళూరు : భారత ఆన్లైన్ రిటైల్ ఇండస్ట్రీకి రారాజు ఎవరంటూ తరచూ జరిగే చర్చలకు దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ చెక్ పెట్టింది. ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరున్న అమెజాన్ కంటే తానే ఎక్కువగా విక్రయాలు నిర్వహించినట్టు వెల్లడించి, దేశీయ ఈ-కామర్స్ రారాజుగా ఫ్లిప్కార్ట్ ప్రకటించుకుంది. గురువారంతో ముగిసిన బిగ్బిలియన్ డేస్ ఫెస్టివల్ అమ్మకాల్లో 15.5 మిలియన్ యూనిట్లను విక్రయించి దేశీయ ఆన్లైన్ మార్కెట్ప్లేస్లో టాప్లో నిలిచినట్టు వెల్లడించింది. 
 
స్మార్ట్ఫోన్లు, టెలివిజన్ విక్రయాలు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే అమ్మకాలకు ఎక్కువగా సహకరించినట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్లు తెలిపారు. ఈ ఈవెంట్ తమకు చాలా ప్రాముఖ్యమైనదని, మరోసారి దేశీయ ఆన్లైన్ మార్కెట్లో తామే రారాజుగా నిరూపించుకోవడానికి ఇది ఎంతో సహకరించిందని ఫ్లిప్కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ తెలిపారు. అయితే ఎంతమొత్తానికి ఈ అమ్మకాలు రికార్డు అయ్యాయో వెల్లడించలేదు. గతేడాది కంపెనీ 300 మిలియన్ డాలర్లకు బిగ్ బిలియన్ డే అమ్మకాలు నిర్వహించింది.
 
మొబైల్, లైఫ్స్టైల్, అతిపెద్ద ఉపకరణాలపై ఎక్కువగా తాము ఫోకస్ చేశామని, ఈ సమయంలో వీటిని కొనడానికే కస్టమర్లు ఎక్కువగా ఆసక్తిచూపుతారని గుర్తించినట్టు వెల్లడించారు. ఫ్లిప్కార్ట్ సీఈవోగా బన్సాల్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మార్కెటింగ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, టెక్నాలజీలల్లో కీలకమైన మార్పులు జరిగి, పోర్టల్,మొబైల్ వెబ్సైట్లలో, అప్లికేషన్లలో ఫ్లిప్కార్ట్కు భారీగా డిమాండ్ పెరిగింది. కాగ ప్రత్యర్థి అమెజాన్ నిర్వహించిన గ్రేట్ ఇండియన్ సేల్ విక్రయాలు కేవలం 15 మిలియన్ యూనిట్లకే పరిమితమైనట్టు బుధవారమే ఆ కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే.  ఫ్లిప్కార్ట్ అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఈ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించగా.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు చేపట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement