‘మా జట్టే అన్ని ఫార్మాట్లలో నెం.1’ | Pakistan Will Reach First Position In All Formats | Sakshi
Sakshi News home page

మా జట్టే అన్ని ఫార్మాట్లలో నెం.1: అబ్దుల్ రజాక్

Published Mon, May 10 2021 9:00 AM | Last Updated on Mon, May 10 2021 2:01 PM

Pakistan Will Reach First Position In All Formats - Sakshi

వరుస విజయాల పరంపరను కొనసాగిస్తోన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు పై మాజీ ఆల్‌రౌండర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న రోజుల్లో అన్ని క్రికెట్‌ ఫార్మాట్లలో పాకిస్థాన్‌  జట్టు నెం. 1 టీమ్‌ గా   అవతారమెత్తబోతుందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్ రజాక్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌ జట్టు ఆటతీరుతో త్వరలోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన స్ధానాన్ని మెరుగుపర్చుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సంవత్సరం పాకిస్థాన్‌  జట్టు బాబర్ అజామ్ నేతృత్వంలో టీం మంచి ఫామ్‌ను కొనసాగించడం మంచి శకునమని మాజీ ఆల్ రౌండర్  పేర్కొన్నాడు.

పాకిస్థాన్‌ ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో, పాకిస్థాన్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకుంది. దాంతోపాటుగా నాలుగు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం  చేసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని సిరీస్‌లో విజయకేతనం ఎగరవేశారు. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-1తో గెలిచారు. కాగా ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో రెండు మ్యాచులను గెలిచి టెస్ట్‌ సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ జట్టు టెస్ట్‌ క్రికిట్‌లో ఐదవ స్థానంలో, వన్డేలో ఆరవ స్థానంలో, టీ20ల్లో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

చదవండి: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌: భారత ఆటగాళ్లకు దక్కని చోటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement