abdul razak
-
వాళ్లిద్దరిపై వేటు వేసిన పీసీబీ.. అబ్దుల్ రజాక్‌కు డబుల్ షాక్!
టీ20 ప్రపంచకప్-2024లో జట్టు వైఫల్యం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. సెలక్టర్ పదవి నుంచి అబ్దుల్ రజాక్‌ను కూడా తప్పించినట్లు సమాచారం.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్‌లో జరిగిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో భాగమైన బాబర్ ఆజం బృందం లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.కనీసం సూపర్-8 కూడా చేరకుండానేపసికూన అమెరికా, పటిష్ట భారత్ చేతిలో ఓడి కనీసం సూపర్-8 కూడా చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్ ఈసారి ఘోరంగా ఇలా వెనుదిరగడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజంను సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ నిర్ణయానికే పీసీబీ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.అయితే, సెలక్షన్ కమిటీ విషయంలో మాత్రం ఈ మేరకు తామే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వహాబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌లను తప్పించాలని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదేశించినట్లు తెలుస్తోంది.వీరిద్దరిని మినహాయిస్తే సెలక్షన్ కమిటీలో ఇంకో ఐదుగురు మిగులుతారు. హెడ్ కోచ్, కెప్టెన్(సంబంధిత ఫార్మాట్), మహ్మద్ యూసఫ్, అసద్ షఫీక్, బిలాల్ అఫ్జల్, డేటా అనలిస్టు ఉంటారు. ఇక రియాజ్, రజాక్ స్థానాలను ఇప్పట్లో భర్తీ చేసేందుకు పీసీబీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. రజాక్‌కు డబుల్ షాక్అంతేకాదు రజాక్‌కు డబుల్ షాకిచ్చిన్నట్లు సమాచారం. మహిళా సెలక్షన్ కమిటీ విధుల నుంచి కూడా అతడిని తప్పించినట్లు తెలుస్తోంది. కాగా అనాలోచిత నిర్ణయాలు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, ఆజం ఖాన్(మాజీ కెప్టెన్ మొయిన్ కుమారుడు) వంటి ఆటగాళ్ల ఎంపిక నేపథ్యంలో వహాబ్ రియాజ్‌పై విమర్శలు వచ్చాయి.అతడి విషయంలో మాజీ క్రికెటర్లు పీసీబీ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు జట్టు వెళ్లిన సమయంలో రియాజ్ కేవలం సీనియర్ టీమ్ మేనేజర్‌గా మాత్రమే వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా అతడిని సెలక్షన్ కమిటీ నుంచి పూర్తిగా తప్పించినట్లు సమాచారం.ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది. కాగా పాక్ బోర్డులో గత కొన్నేళ్లుగా నిలకడ లేకుండా పోయింది. గడిచిన నాలుగేళ్లలో ఆరుగురు చీఫ్ సెలక్టర్లు మారారు. హరూన్ రషీద్, షాహిద్ ఆఫ్రిది, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ వసీం, మిస్బా ఉల్ హక్, వహాబ్ రియాజ్ ఈ హోదాలో పనిచేశారు. చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
ఐశ్వర్యరాయ్ పై నోరుజారిన అబ్దుల్ రజాక్
-
ఐశ్వర్య రాయ్‌పై పాక్ క్రికెటర్ బలుపు మాటలు.. రజాక్,అఫ్రిది,అక్తర్ క్షమాపణలు
భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్- 2023 జరుగుతుంది. ఇందులో భాగంగా నేడు సెమీస్‌లో భారత్ Vs న్యూజిలాండ్ మధ్య పోరు జరగనుంది. ఈ మెగా టోర్నీలో లీగ్ స్టేజ్‌లో కేవలం నాగుగు విజయాలను మాత్రమే నమోదుచేసిన పాకిస్తాన్ ఇంటిముఖం పట్టింది. ఈ వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో పాక్ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ ఓటములను పాక్ అభిమానులతో పాటు ఆ జట్టు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇండియన్ నటి ఐశ్వర్య రాయ్‌పై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారానికి తేరలేపాయి. ఓ ఓపెన్ డిబేట్లో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదిలతో కలిసి రజాక్ మాట్లాడాడు. క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ పట్ల చెత్త వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. అబ్దుల్ రజాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ' ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే' అంటూ హద్దులు దాటాడు . రజాక్ నోటి వెంట ఒక్కసారిగా ఐశ్వర్య రాయ్ పేరు రావడంతో మొదట షాక్ తిన్న షాహిద్ అఫ్రిది.. ఆ తర్వాత నవ్వుతూ చప్పట్లు కొట్టడం గమనార్హం. రజాక్‌తో పాటు గుల్, అఫ్రిదిల తీరుపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. మీ దేశం నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్ అవుతున్నారు. ఒక స్త్రీ పట్ల ఇలా మాట్లాడటం సిగ్గు చేటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఐశ్వర్య రాయ్ ఇంట్లో బాత్రూమ్లు క్లీన్ చేయడానికి కూడా పనికిరావు అంటూ రజాక్‌ను ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు కోరిన అబ్దుల్ రజాక్ భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన సోషల్ మీడియా ద్వారా ఐశ్వర్య రాయ్‌కు అబ్దుల్ రజాక్ క్షమాపణలు చెప్పాడు. 'ఆ సమయలో నేను క్రికెట్ గురించి మాట్లాడుతున్నాను. క్రికెట్‌కు సంబంధించిన ఉదాహరణను ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో అనుకోకుండా నోరు జారి ఐశ్వర్య రాయ్ పేరు తీసుకున్నాను. అది నా ఉద్దేశ్యం కాదు. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను.' అని రజాక్ అన్నారు. వివరణ ఇచ్చిన షాహిద్ అఫ్రిది ఐశ్వర్య రాయ్ గురించి రజాక్ వ్యాఖ్యలు చేసినప్పుడు అందరూ నవ్వారని ఆ సమయంలో తాను నవ్వానని చెప్పాడు. కానీ రజాక్ మాటలు తనకు ఆ సమయంలో అర్థం కాలేదని షాహిద్ అఫ్రిది స్పష్టం చేశాడు. 'ఆ సమయంలో అందరూ నవ్వుతున్నారు. ఆ మాటలు నేను గమనించలేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత, రజాక్ మాటలను నాకు షేర్ చేశారు. ఆ వీడియో క్లిప్‌ను మళ్లీ విన్నాను. అప్పుడు నాకు అసౌకర్యంగా అనిపించింది. నేను వెంటనే రజాక్‌తో మాట్లాడి.. క్షమాపణ చెప్పమని కోరడం జరిగింది. ఎందుకంటే అలాంటి వ్యాఖ్య ఎవరి గురించి చేయకూడదు.' అని అఫ్రిది అన్నారు. తప్పు పట్టిన షోయబ్ అక్తర్ షోయబ్ అక్తర్ కూడా రజాక్ వ్యాఖ్యలను ఖండించాడు. స్త్రీలపై ఇలాంటి జోక్,పోలిక సరికాదని అన్నారు. 'ఏ స్త్రీని ఇలా అగౌరవపరచకూడదు. ఆ సమయంలో అతని పక్కన కూర్చున్న వ్యక్తులు నవ్వడం, చప్పట్లు కొట్టడం కూడా తప్పే. ఆ సమయంలో వారు రజాక్‌ను తప్పు పట్టాల్సింది. ఇది క్షమించరాని తప్పు. అతనిపై తిరగబడి హెచ్చరించాల్సింది.' అని షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు. Shameful example given by Abdul Razzaq. #AbdulRazzaq #CWC23 pic.twitter.com/AOboOVHoQU — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) November 13, 2023 We were talking about cricket yesterday, and I meant to give a different example, but Aishwarya's name slipped out of my mouth. I'm sorry 🙏 #AishwaryaRai #AbdulRazzaq pic.twitter.com/LKp2uFNxXm — Abdul Razzaq (@AbdulRazzaq_PAK) November 14, 2023 -
‘మా జట్టే అన్ని ఫార్మాట్లలో నెం.1’
వరుస విజయాల పరంపరను కొనసాగిస్తోన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు పై మాజీ ఆల్‌రౌండర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న రోజుల్లో అన్ని క్రికెట్ ఫార్మాట్లలో పాకిస్థాన్ జట్టు నెం. 1 టీమ్ గా అవతారమెత్తబోతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆటతీరుతో త్వరలోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన స్ధానాన్ని మెరుగుపర్చుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సంవత్సరం పాకిస్థాన్ జట్టు బాబర్ అజామ్ నేతృత్వంలో టీం మంచి ఫామ్‌ను కొనసాగించడం మంచి శకునమని మాజీ ఆల్ రౌండర్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో, పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకుంది. దాంతోపాటుగా నాలుగు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని సిరీస్‌లో విజయకేతనం ఎగరవేశారు. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-1తో గెలిచారు. కాగా ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచులను గెలిచి టెస్ట్ సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు టెస్ట్ క్రికిట్‌లో ఐదవ స్థానంలో, వన్డేలో ఆరవ స్థానంలో, టీ20ల్లో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. చదవండి: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్: భారత ఆటగాళ్లకు దక్కని చోటు -
మాజీ డీఎస్పీ సీసీ సస్పెన్షన్
ఆలస్యంగా వెలుగులోకి కప్పి ఉంచిన అధికారులు కరీంనగర్ క్రైం : కరీంనగర్ డీఎస్పీ సీసీగా పనిచేసిన అబ్దుల్ రజాక్‌ను సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వైద్యుడిని తప్పిస్తానని పెద్ద మెుత్తం వసూలు చేసిన ఘటనలో మెుదటి బదిలీ చేసిన తర్వాత సస్పెన్షన్ వేటు వేశారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 2015, ఆగస్టులో వేర్వేరు వ్యక్తుల ఫిర్యాదుతో రెండు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ నిందితుడిగా ఉన్న ఓ వైద్య విద్యార్థిని తప్పించేందుకు కొందరు ఆ సమయంలో కరీంనగర్ డీఎస్పీ సీసీగా పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ రజాక్‌ను సంప్రదించారు. వీరి నుంచి రజాక్ సుమారు రూ.3.4 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే వన్‌టౌన్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత రజాక్ వద్దకు వెళ్లి డబ్బులు తిరిగివ్వమనగా.. సరైన సమాధానం రాకపోవడంతో బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించకపోవడంతో ఎస్పీ జోయల్‌డెవిస్ ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. నాలుగు రోజుల క్రితం రజాక్‌కు ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. రోజు డబ్బులు తీసుకున్న విషయం రుజువు కావడంతో మరుసటి రోజు సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు యత్నించారు. గతంలోనూ కరీంనగర్ డీఎస్పీ రామారావు సీసీగా పనిచేసిన సమ్మయ్య సస్పెన్షన్‌కు గురికాగా ప్రస్తుతం అబ్దుల్ రజాక్‌పై వేటు పడడం గమనార్హం.