అశ్విన్‌‌ ఆల్‌రౌండర్‌ ర్యాంకు పైపైకి | Ravichandran Ashwin Placed 5th ICC Test All Rounder | Sakshi
Sakshi News home page

అశ్విన్‌‌ ఆల్‌రౌండర్‌ ర్యాంకు పైపైకి

Published Thu, Feb 18 2021 8:01 AM | Last Updated on Thu, Feb 18 2021 8:33 AM

Ravichandran Ashwin Placed 5th ICC Test All Rounder - Sakshi

దుబాయ్‌: భారత సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు ఆల్‌రౌండర్‌ ర్యాంకుల్లో ఐదో స్థానానికి ఎగబాకాడు. 336 పాయింట్లతో ర్యాంకింగ్‌లో పైపైకి చేరుకున్నాడు. రెండో టెస్టులో బంతితో ప్రత్యర్థిని తిప్పేసిన అశ్విన్‌ బ్యాటింగ్‌లోనూ సెంచరీ సాధించడంతో ర్యాంకు మెరుగైంది. అయితే అశ్విన్‌ బౌలర్ల జాబితాలో మాత్రం నిలకడగా ఏడో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. బుమ్రా 8వ స్థానంలో ఉన్నాడు. ఈ విభాగంలో కమిన్స్‌ (ఆసీస్‌)ది అగ్రస్థానం.

ఇదిలా ఉండగా.. బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌‌ కోహ్లి ఐదో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 14వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. రిషభ్‌ పంత్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ స్థాయికి చేరుకుని, 11వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌ విభాగంలో రిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 50 వ స్థానంలో ఉండగా, రెండో మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ 68వ స్థానానికి చేరుకున్నాడు.
చదవండిఅశ్విన్‌ సెంచరీ.. హై క్లాస్‌‌: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement