
దుబాయ్ : క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధాన అగ్రస్థానం కైవసం చేసుకుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న మంధాన ఇప్పటికే వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2018, వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2018ను సొంతం చేసుకుని ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు ఐసీసీ అవార్డులను దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డును నెలకొల్పారు. నిలకడగా రాణిస్తున్న మంధాన తాజాగా ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంకును అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment