
దుబాయ్:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో విశేషంగా రాణించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ర్యాంక్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. లంకేయులతో సిరీస్‌లో 610 పరుగులు సాధించిన కోహ్లి.. తాజాగా విడుదల చేసిన బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-2కు చేరాడు. ఈ సిరీస్‌కు ముందు ఆరో స్థానంలో ఉన్న కోహ్లి ఒకేసారి నాలుగు పాయింట్లను మెరుగుపరుచుకుని రెండో స్థానానికి ఎగబాకాడు.
నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టుల్లో డబుల్ సెంచరీలతో మెరిసిన కోహ్లి 893 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అటు వన్డేల్లో, ఇటు టీ 20ల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న కోహ్లి.. టెస్టుల్లో నంబర్ వన్‌గా నిలవడానికి అడుగుదూరంలో ఉన్నాడు. ప్రస్తుతం టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 938 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక్కడ జో రూట్ 879 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, చతేశ్వర పుజారా 873 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment