
ధావన్, రోహిత్ పైపైకి...
ప్రపంచకప్ లో రాణించిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్ లో పైకి ఎగబాకారు.
దుబాయ్: ప్రపంచకప్ లో రాణించిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్ లో పైకి ఎగబాకారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్ లో ధావన్ 6వ స్థానం దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), మిస్బా(పాకిస్థాన్)తో కలిసి సంయుక్తంగా 12వ ర్యాంక్ లో నిలిచాడు. విరాట్ కోహ్లి 4, కెప్టెన్ ధోని 8వ ర్యాంకుల్లో ఉన్నారు. సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డీవిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలర్ల విభాగంలో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ తొలిసారిగా టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. భారత్ బౌలర్ ఉమేష్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్ దక్కించుకున్నాడు.
వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా టీమ్ నంబన్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా సెకండ్ ర్యాంకులో కొనసాగుతోంది.