దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్థానాన్ని మెరుగుపరచుకుని నాలుగో ర్యాంక్‌కు ఎగబాకాడు. ప్రస్తుతం 814 రేటింగ్ పాయింట్లు కలిగిన కోహ్లీ.. ప్రపంచ టెస్ట్ ఛాంపియనిషిప్(డబ్ల్యూసీ) ఫైనల్, ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సిన నేపథ్యంలో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టి తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా, ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ మూడో ర్యాంకులో, ఇంగ్లాండ్ సారథి జో రూట్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. టీమిండియా డాషింగ్ ఆటగాళ్లు రిషబ్ పంత్ (797), రోహిత్ శర్మ (797) సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు.
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ (886) దారుణంగా విఫలం కావడంతో అతడి రేటింగ్ పాయింట్లలో కోత పడింది. దీంతో మ్యాచ్‌లు ఆడకపోయినా స్టీవ్ స్మిత్(891) మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఈ క్రమంలో గ్యారీ సోబర్స్ (189 టెస్టులు), వివ్ రిచర్డ్స్ (179 టెస్టులు) తర్వాత ఎక్కువ మ్యాచ్‌లకు(167) నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ జాబితాలో ప్యాట్ కమిన్స్ (908), రవిచంద్రన్ అశ్విన్ (850), టిమ్ సౌథీ (830) టాప్-3 బౌలర్లుగా కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ 307 రేటింగ్ పాయింట్లతో 64వ స్థానానికి దూసుకొచ్చాడు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు అశ్విన్ 2, జడేజా 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.
చదవండి: WTC Final: చారిత్రక మ్యాచ్‌కు వరుణ గండం..?
Comments
Please login to add a commentAdd a comment