Test batsman rankings
-
Joe Root: ‘నంబర్‌వన్’ రూట్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (901 రేటింగ్ పాయింట్లు)ను వెనక్కి నెట్టి ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (916 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. రూట్ 2015 డిసెంబర్ తర్వాత మళ్లీ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. మరోవైపు భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఈ క్రమంలో కోహ్లి (6వ ర్యాంక్)ను వెనక్కి నెట్టాడు. 2017 నవంబర్ తర్వాత భారత్ నుంచి మరో బ్యాట్స్‌మన్ కోహ్లికంటే మెరుగైన ర్యాంక్‌లో ఉండటం ఇదే మొదటిసారి. -
ICC Rankings: టాప్ ర్యాంక్ దిశగా టీమిండియా కెప్టెన్..
దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్థానాన్ని మెరుగుపరచుకుని నాలుగో ర్యాంక్‌కు ఎగబాకాడు. ప్రస్తుతం 814 రేటింగ్ పాయింట్లు కలిగిన కోహ్లీ.. ప్రపంచ టెస్ట్ ఛాంపియనిషిప్(డబ్ల్యూసీ) ఫైనల్, ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సిన నేపథ్యంలో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టి తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా, ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ మూడో ర్యాంకులో, ఇంగ్లాండ్ సారథి జో రూట్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. టీమిండియా డాషింగ్ ఆటగాళ్లు రిషబ్ పంత్ (797), రోహిత్ శర్మ (797) సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ (886) దారుణంగా విఫలం కావడంతో అతడి రేటింగ్ పాయింట్లలో కోత పడింది. దీంతో మ్యాచ్‌లు ఆడకపోయినా స్టీవ్ స్మిత్(891) మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఈ క్రమంలో గ్యారీ సోబర్స్ (189 టెస్టులు), వివ్ రిచర్డ్స్ (179 టెస్టులు) తర్వాత ఎక్కువ మ్యాచ్‌లకు(167) నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ జాబితాలో ప్యాట్ కమిన్స్ (908), రవిచంద్రన్ అశ్విన్ (850), టిమ్ సౌథీ (830) టాప్-3 బౌలర్లుగా కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ 307 రేటింగ్ పాయింట్లతో 64వ స్థానానికి దూసుకొచ్చాడు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు అశ్విన్ 2, జడేజా 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. చదవండి: WTC Final: చారిత్రక మ్యాచ్‌కు వరుణ గండం..? -
కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే
దుబాయ్: సంవత్సరం పాటు ఆటకు దూరమైనా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ మళ్లీ దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మిత్ రెండో స్థానానికి (913 రేటింగ్ పాయింట్లు) చేరుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 378 పరుగులు చేసిన స్మిత్... కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వెనక్కి తోసి కోహ్లి తర్వాతి స్థానంలో నిలిచాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (922) ఈ జాబితాలో నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు. యాషెస్‌లో స్మిత్‌కు మరో మూడు టెస్టులు మిగిలి ఉండగా, కోహ్లి విండీస్‌తో రెండు టెస్టులు ఆడనున్నాడు. ఇద్దరి మధ్య పాయింట్ల తేడా 9 మాత్రమే కావడంతో అగ్రస్థానానికి ఇప్పుడు హోరాహోరీ పోటీ తప్పదు. కోహ్లితో పాటు టాప్–10లో భారత్ నుంచి పుజారా (4వ స్థానంలో) ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా (5వ ర్యాంక్), అశ్విన్ (10వ ర్యాంక్) టాప్–10లో ఉండగా... ప్యాట్ కమిన్స్ (914 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన కరుణరత్నే (8వ ర్యాంక్) నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్–10లోకి అడుగు పెట్టగా...వరుసగా విఫలమవుతున్న జో రూట్ 6 నుంచి 9వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జేసన్ హోల్డర్ నంబర్‌వన్‌గా నిలిచాడు. -
అగ్రస్థానంలోనే కోహ్లి
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆదివారం ప్రకటించిన ర్యాంక్లులో 922 రేటింగ్ పాయింట్లతో అతను టాప్‌లో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (897) రెండో స్థానంలో కొనసాగుతుండగా... భారత ఆటగాడు చతేశ్వర్ పుజారా (881) మూడో స్థానంలో ఉన్నాడు. ఇతర భారత బ్యాట్స్‌మెన్‌లో రిషభ్ పంత్ (15వ స్థానం) ఒక్కడే టాప్–20లో నిలిచాడు. మరోవైపు 153 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో శ్రీలంకను తొలి టెస్టులో గెలిపించిన కుశాల్ పెరీరా ఏకంగా 58 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం! 13 ఏళ్ల తర్వాత... టెస్టు బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ (878 రేటింగ్ పాయింట్లు) తొలిసారి నంబర్‌వన్‌గా ఎదిగాడు. 13 ఏళ్ల తర్వాత ఆసీస్ బౌలర్ అగ్రస్థానానికి చేరడం ఇదే ప్రథమం. చివరిసారి 2006లో ఆసీస్ నుంచి గ్లెన్ మెక్‌గ్రాత్ ఈ ఘనత సాధించాడు. లంకతో తొలి టెస్టులో 3 వికెట్లే తీసిన దక్షిణాఫ్రికా పేసర్ రబడ (849) మూడో స్థానానికి పడిపోగా, ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ (862) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ జాబితాలో భారత్ తరఫున స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5), అశ్విన్ (10) మాత్రమే టాప్–10లో కొనసాగుతుండగా, బుమ్రా 16వ స్థానంలో నిలిచాడు. -
నాలుగో ర్యాంకుకు పడిపోయిన కోహ్లి
ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో స్థానం కోల్పోయాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతను మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లి వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. తొలి మూడు స్థానాల్లో వరుసగా స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), విలియమ్సన్ (న్యూజిలాండ్), జో రూట్ (ఇంగ్లండ్) ఉన్నారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ సెంచరీతో కదంతొక్కడంతో రూట్, కోహ్లిలను వెనక్కి నెట్టి రెండో ర్యాంకులో నిలిచాడు.