
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆదివారం ప్రకటించిన ర్యాంక్లులో 922 రేటింగ్ పాయింట్లతో అతను టాప్‌లో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (897) రెండో స్థానంలో కొనసాగుతుండగా... భారత ఆటగాడు చతేశ్వర్ పుజారా (881) మూడో స్థానంలో ఉన్నాడు. ఇతర భారత బ్యాట్స్‌మెన్‌లో రిషభ్ పంత్ (15వ స్థానం) ఒక్కడే టాప్–20లో నిలిచాడు. మరోవైపు 153 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో శ్రీలంకను తొలి టెస్టులో గెలిపించిన కుశాల్ పెరీరా ఏకంగా 58 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం!
13 ఏళ్ల తర్వాత...
టెస్టు బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ (878 రేటింగ్ పాయింట్లు) తొలిసారి నంబర్‌వన్‌గా ఎదిగాడు. 13 ఏళ్ల తర్వాత ఆసీస్ బౌలర్ అగ్రస్థానానికి చేరడం ఇదే ప్రథమం. చివరిసారి 2006లో ఆసీస్ నుంచి గ్లెన్ మెక్‌గ్రాత్ ఈ ఘనత సాధించాడు. లంకతో తొలి టెస్టులో 3 వికెట్లే తీసిన దక్షిణాఫ్రికా పేసర్ రబడ (849) మూడో స్థానానికి పడిపోగా, ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ (862) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ జాబితాలో భారత్ తరఫున స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5), అశ్విన్ (10) మాత్రమే టాప్–10లో కొనసాగుతుండగా, బుమ్రా 16వ స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment