
దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు చతేశ్వర్ పుజారా రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. శ్రీలంకతో నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టెస్టులో 143 పరుగులతో రాణించిన పుజారా 22 పాయింట్లను తన ఖాతాలో వేసుకుని రెండో స్థానాన్ని సాధించాడు. తాజాగా విడుదల చేసిన బ్యాట్స్‌మెన ర్యాంకింగ్స్‌లో 888 రేటింగ్ పాయింట్లను పుజారా సాధించాడు. ఫలితంగా కెరీర్ అత్యధిక పాయింట్లను పుజారా నమోదు చేశాడు. ఇక్కడ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే 11 అత్యధిక పాయింట్లను పుజారా కల్గి ఉండటం విశేషం. అయితే అంతకుముందు పుజారా నంబర్ టూ ర్యాంకును రెండుసార్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకతో కొలంబోలో టెస్టు తరువాత రెండో ర్యాంకును సాధించిన పుజారా.. అంతకుముందు మార్చిలో ఆసీస్‌తో రాంచీలో జరిగిన టెస్టు మ్యాచ్ తరువాత కూడా రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
కాగా, ప్రస్తుతం కోహ్లి 877 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. లంకేయులతో మ్యాచ్ తరువాత కోహ్లి 60 పాయింట్లను సాధించి టాప్-5లో నిలిచాడు. ఇక్కడ 941 రేటింగ్ పాయింట్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నంబర్ వన్ ర్యాంకును నిలుపుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో శతకంతో మెరిసిన స్మిత్ ఐదు పాయింట్లను సాధించాడు.మరొకవైపు బౌలర‍్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండో స్థానానికి ఎగబాకాడు. లంకతో రెండో టెస్టులో ఐదు వికెట్లు సాధించిన జడేజా రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment