
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 23) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఎలాంటి భారీ మార్పులు చోటు చేసుకోలేదు. వన్డే, టీ20, టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్ ప్లేస్‌లు యధాతథంగా కొనసాగుతున్నాయి. బ్యాటింగ్ విభాగం వన్డేల్లో బాబర్ ఆజమ్, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, టెస్ట్‌ల్లో కేన్ విలియమ్సన్..
బౌలింగ్ విభాగం వన్డేల్లో జోష్ హాజిల్‌వుడ్, టెస్ట్‌ల్లో రవిచంద్రన్ అశ్విన్, టీ20ల్లో రషీద్ ఖాన్.. ఆల్‌రౌండర్ల విభాగం వన్డేల్లో, టీ20ల్లో షకీబ్, టెస్ట్‌ల్లో రవీంద్ర జడేజా అగ్రపీఠాలపై తమ స్థానాలను పదిలంగా కాపాడుకున్నారు.
వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ మూడు స్థానాలు ఎగబాకి మూడో ప్లేస్‌కు చేరుకోగా.. వన్డే బ్యాటింగ్ విభాగంలో ఇమామ్ ఉల్ హాక్, శుభ్‌మన్ గిల్ చెరో స్థానం మెరుగుపర్చుకుని 3,4 స్థానాలకు చేరుకున్నారు.
భారీ జంప్ కొట్టిన రుతురాజ్..
ఐర్లాండ్‌తో రెండో టీ20లో హాఫ్‌సెంచరీతో రాణించిన టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 143 స్థానాలు మెరుగుపర్చుకుని 87వ స్థానానికి ఎగబాకాడు.
ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్న బిష్ణోయ్, బుమ్రా
ఐర్లాండ్‌తో తొలి రెండు టీ20ల్లో రెండ్రెండు వికెట్లు పడగట్టిన బిష్ణోయ్, బుమ్రా తాజా టీ20 ర్యాంకింగ్స్ తమ స్థానాలను ఓ మోస్తరుగా మెరుగుపర్చుకున్నారు. బిష్ణోయ్ 17 స్థానాలు మెరుగుపర్చుకుని 65వ ప్లేస్‌కు.. బుమ్రా 7 స్థానాలు మెరుపర్చుకుని 84వ ప్లేస్‌కు ఎగబాకారు.