విరాట్ కోహ్లి ర్యాంక్ 15 | Virat Kohli at 15th spot in latest ICC Player Rankings | Sakshi
Sakshi News home page

విరాట్ కోహ్లి ర్యాంక్ 15

Published Thu, Jan 1 2015 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

విరాట్ కోహ్లి ర్యాంక్ 15

విరాట్ కోహ్లి ర్యాంక్ 15

దుబాయ్: మెల్‌బోర్న్ టెస్టులో అద్భుతంగా రాణించిన భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లి... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో అతను 15వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. రహానే 15 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ ర్యాంక్‌లో నిలిచాడు. చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్‌లు వరుసగా 19, 20వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు.

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తొలిసారి 5వ స్థానంలో నిలిచి కెరీర్‌లో బెస్ట్ ర్యాంక్‌ను నమోదు చేశాడు. డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు చెరో 8 స్థానాలు మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు వరుసగా 36, 38వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో అశ్విన్ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement