
విరాట్ కోహ్లి
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి వన్డేల్లో రెండో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి తన ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. భారత కెప్టెన్ ధోని, ఓపెనర్ శిఖర్ ధావన్‌లు వరుసగా ఆరు, పదో స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఈ జాబితాలో డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)ది అగ్రస్థానం. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఆరో ర్యాంకుకు ఎగబాకగా, అశ్విన్ 17వ ర్యాంకులోనే ఉన్నాడు. ఇందులో సయీద్ అజ్మల్ (పాకిస్థాన్) టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా ఐదో స్థానంలో ఉన్నాడు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 120 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతోంది.