
టీమిండియా వన్డే ర్యాంకు పదిలం
ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా వన్డే ర్యాంకింగ్ లో మాత్రం ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు.
దుబాయ్: ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా వన్డే ర్యాంకింగ్ లో మాత్రం ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. టీమిండియా 114 పాయింట్లతో తన రెండో స్థానాన్ని కాపాడుకోగా, దక్షిణాఫ్రికా 112 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 127 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం నుంచి నాలుగు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్న ఇంగ్లండ్, పాకిస్థాన్ లు వరుసగా ఆరు, ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
ట్వంటీ 20ల్లో టీమిండియా ఆరో స్థానానికి పరిమితం కాగా, పాకిస్థాన్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచాయి. శ్రీలంక 126 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.