మరోసారి ‘రికార్డు’ సెంచరీ | Meg Lanning hits T20 record Century against England | Sakshi
Sakshi News home page

మరోసారి ‘రికార్డు’ సెంచరీ

Jul 28 2019 10:39 AM | Updated on Jul 28 2019 10:40 AM

Meg Lanning hits T20 record  Century against England - Sakshi

చెమ్స్‌ఫోర్డ్‌:  మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో లానింగ్‌ 63 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 133 పరుగులతో రికార్డు సెంచరీ చేశారు. దీంతో  మహిళల టీ20ల్లో తనపేరిటే ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును లానింగ్‌ అధిగమించారు. గతంలో లానింగ్‌ 126 పరుగులు సాధించి అత్యధిక పరుగుల రికార్డును నమోదు చేశారు. మరొకసారి సెంచరీ సాధించడంతో పాటు తన రికార్డును లానింగ్‌ బ్రేక్‌ చేశారు.

లానింగ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా ఆసీస్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 226 రన్స్‌ సాధించింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (54) అర్ధ సెంచరీ చేసింది. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 రన్స్‌కే పరిమితమైంది.  అదే సమయంలో టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి పాయింట్ల ఆధారంగా సాగుతున్న మహిళల యాషెస్‌ ట్రోఫీని కూడా ఆసీస్‌ దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement