మారని ఆర్‌సీబీ ఆటతీరు.. వరుసగా ఐదో ఓటమి
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ వుమెన్ కథ మారడం లేదు. లీగ్‌లో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. సోమవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది.
అలైస్ క్యాప్సీ(38 పరుగులు), కాప్(32 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ 32 పరుగులు, జెస్ జొనాసెన్ 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. ఆర్‌సీబీ బౌలర్లలో ఆశా శోభనా రెండు వికెట్లు తీయగా.. ప్రీతిబోస్, మేఘన్ స్కాట్ చెరొక వికెట్ తీశారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్ 37 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నొరిస్ ఒక వికెట్ పడగొట్టింది.
నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
నిలకడగా ఆడుతున్న జెమీమా రోడ్రిగ్స్(32) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కాప్ 16, జొనాసెన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు కావాలి.
12 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 90/3
12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ 18, కాప్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు కెప్టె్న్ మెగ్ లానింగ్ 15 పరుగులు చేసి ఆశా శోభనా బౌలింగ్‌లో హెథర్‌నైట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
అలైస్ క్యాప్సీ(38) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులుగా ఉంది. మెగ్ లానింగ్ 3 పరుగులతో క్రీజులో ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 151
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్ 37 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నొరిస్ ఒక వికెట్ పడగొట్టింది.
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్.. ప్రస్తతం ఢిల్లీ 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.
12 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 62/2
12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 23, హెథర్ నైట్ 11 పరుగులతో ఆడుతున్నారు.
8 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 38/1
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతుంది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. క్రీజులో ఎలిస్ పెర్రీ 10, సోఫీ డివైన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు స్మృతి మంధాన 8 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
స్మృతి మంధాన ఔట్.. తొలి వికెట్ డౌన్
ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వైఫల్యం కొనసాగుతుంది. ఢిల్లీ వుమెన్‌తో మ్యాచ్‌లో 8 పరుగులు మాత్రమే చేసిన మంధాన శిఖా పాండే బౌలింగ్‌లో రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇవాళ ఆర్‌సీబీ వుమెన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఏంచుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వరుసగా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉంది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి.. ఒక్క ఓటమితో ఆరు పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది.
అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీని ఆర్‌సీబీ వుమెన్స్ ఎంత మేరకు నిలువరిస్తుందనేది చూడాలి. ఇక తొలి రౌండ్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ): స్మృతి మంధన(కెప్టెన్), సోఫీ డివైన్, హీథర్ నైట్, దిషా కసత్, ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోబన, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్
ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ): షఫాలీ వర్మ, మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), మరిజాన్ కప్, జెమీమా రోడ్రిగెస్, అలైస్ క్యాప్సీ, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా (వికెట్‌కీపర్), అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే, తారా నోరిస్
Comments
Please login to add a commentAdd a comment