మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా) సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ మూడో ఓవర్‌లో షబ్నిమ్ మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించింది. ఈ ఓవర్ రెండో బంతిని షబ్నిమ్ 132.1 కిమీ వేగంతో సంధించింది. మహిళల క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. షబ్నిమ్ రికార్డును ఆమెనే బ్రేక్ చేసుకుంది.
Mumbai Indians fast bowler Shabnim Ismail bowled the Fastest Delivery by a Women's Cricket - 132.1 KMPH 👏 #MIvDC #WPL2024 #DCvMI pic.twitter.com/srOZimZ0HQ
— Richard Kettleborough (@RichKettle07) March 5, 2024
2016లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షబ్నిమ్ 128 కిమీ వేగంతో బంతిని సంధించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు మహిళల క్రికెట్‌లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీగా ఉండింది. 2022 వన్డే వరల్డ్‌కప్‌లో షబ్నిమ్ రెండు సార్లు 127 కిమీ వేగంతో బంతులను సంధించింది. తాజాగా తన పేరిట ఉండిన రికార్డును షబ్నిమ్ తనే బ్రేక్ చేసుకుంది. మహిళల క్రికెట్‌లో 130 కిమీలకు పైగా వేగంతో నమోదైన బంతి ఇదే కావడం మరో విశేషం.
ఇదిలా ఉంటే, షబ్నిమ్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై 168 పరుగులకే పరిమితమై 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో షబ్నిమ్ 4 ఓవర్లలో 46 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment