మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 27) మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆర్సీబీ ప్లేయర్, టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి "Will You Marry Me Shreyanka" (నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయాంక) అని రాసి ఉన్న ప్లకార్డ్‌ను ప్రదర్శించాడు. ఆ ప్లకార్డ్‌పై హార్ట్ సింబల్‌తో పాటు అతని పేరు కన్నడలో రాసి ఉంది. ఈ సీన్ లైవ్‌లోకి రాగానే డగౌట్‌లో ఉన్న ఆర్సీబీ ప్లేయర్లు నవ్వుకున్నారు. క్రీడా ప్రాంగణాల్లో ఇలా జరగడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో క్రీడాకారులు ఇలాంటి ప్రపోజల్స్ అందుకున్నారు. గతంలో మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ అందుకున్న పెళ్లి ప్రపోజల్ బాగా హైలైట్ అయ్యింది.
Marriage proposal for Shreyanka Patil and RCB’s players laughing in the dressing room. pic.twitter.com/yoY4e5zfxK
— CricketMAN2 (@ImTanujSingh) February 27, 2024
బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల శ్రేయాంక (రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్) ఆర్సీబీతో పాటు కర్ణాటక, టీమిండియా, గయానా అమెజాన్ వారియర్స్‌కు (కరీబియన్ ప్రీమియర్ లీగ్) ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ అమ్మాయి టీమిండియా తరఫున 2 వన్డేలు (4 వికెట్లు), 6 టీ20లు (8 వికెట్లు) ఆడింది.
కాగా, గుజరాత్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేయగా.. ఆర్సీబీ కేవలం 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రేణుకా సింగ్ (4-0-14-2), మోలినెక్స్ (4-0-25-3), స్మృతి మంధన (43), సబ్బినేని మేఘన (36 నాటౌట్), ఎల్లిస్ పెర్రీ (23 నాటౌట్) ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment