పూరన్ భారీ సిక్సర్‌.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్‌ | Pooran Slams 106-Metre Six Out Of The Ground | Sakshi
Sakshi News home page

IPL 2024: పూరన్ భారీ సిక్సర్‌.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్‌

Apr 2 2024 10:25 PM | Updated on Apr 3 2024 9:46 AM

Pooran Slams 106-Metre Six Out Of The Ground - Sakshi

ఐపీఎల్‌-2024లో వెస్టిండీస్‌ ఆటగాడు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ వైస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో పూరన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. పూరన్‌ కేవలం 21 బంతుల్లో 5 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 40 పరుగులు చేశాడు.

అయితే ఈ మ్యాచ్‌లో పూరన్ కొట్టిన ఓ సిక్సర్‌ అందరిని షాక్‌ గురిచేసింది. లక్నో ఇన్నింగ్స్‌ 19 ఓ‍వర్‌లో రీస్‌ టాప్లీ  వేసిన ఫుల్‌ టాస్‌ బాల్‌ను.. పూరన్‌ మిడ్‌ వికెట్‌ మీదగా 106 మీటర్ల భారీ సిక్సర్‌ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన పూరన్‌ 146 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement