ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మయాంక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సంచలనం సృష్టించిన మయాంక్.. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లలో మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
అయితే ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం మయాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ తమ సొంత గ్రౌండ్‌లో ఆడుతున్నప్పటికి ఆ జట్టు అభిమానులు మాత్రం తనను ఎంతగానో సపోర్ట్ చేశారని మయాంక్ తెలిపాడు.
"జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా చివరి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ అభిమానులతో నిండిపోయింది. ఆర్సీబీకి స్పెషల్ ఫ్యాన్ బేస్‌ఉంది. కానీ ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ అభిమానులు నన్ను సపోర్ట్ చేశారు.
నా స్పెల్ తర్వాత, నేను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ చప్పట్లు కొడుతూ నన్ను ఉత్సాహపరిచారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని" మయాంక్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment