LSG Vs DC: కుల్దీప్‌ మ్యాజిక్‌ డెలివరీ.. పూరన్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌ | IPL 2024 LSG Vs DC: Kuldeep Yadavs Ball Of IPL 2024 Cleans Up Pooran For A Golden Duck, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 LSG Vs DC: కుల్దీప్‌ మ్యాజిక్‌ డెలివరీ.. పూరన్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Published Fri, Apr 12 2024 10:59 PM | Last Updated on Sat, Apr 13 2024 10:45 AM

Kuldeep Yadavs Ball Of IPL 2024 Cleans Up Pooran - Sakshi

ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సంచలన బంతితో మెరిశాడు. కుల్దీప్‌ అద్బుతమైన బంతితో లక్నో విధ్వంసకర ఆటగాడు నికోలస్‌ పూరన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. లక్నో ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన కుల్దీప్‌ మూడో బంతికి మార్కస్‌ స్టోయినిష్‌ను ఔట్‌ చేశాడు.

ఆ తర్వాత క్రీజులోకి పూరన్‌కు కుల్దీప్‌ ఆఫ్ స్టంప్ దిశగా అద్బుతమైన గూగ్లీని సంధించాడు. అయితే బంతి టర్న్‌ అవుతుందని భావించిన పూరన్‌ ఆఫ్‌సైడ్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. గానీ బంతి ఎటువంటి టర్న్‌ కాకుండా బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య నుంచి స్టంప్స్‌ను గిరాటేసింది.

ఇది చేసిన పూరన్‌ ఒక్కసారిగా బిత్తరపోయాడు. కుల్దీప్‌ దెబ్బకు పూరన్‌ ఖాతాతెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ 3 వికెట్లతో సత్తాచాటాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement