All IPL franchises would want to buy Yuzvendra Chahal in IPL Auction: ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు 8 ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రీటైన్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్‌సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రీటైన్ చేసుకోలేదు. కెప్టెన్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ను మాత్రమే ఆర్‌సీబీ రీటైన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న మెగా వేలంలో చాహల్‌కు భారీ ధర దక్కనుందని భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డాడు.
కాగా గత కొన్ని సీజన్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్‌కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్- 2021 తొలి విడతలో పెద్దగా రాణించకపోయినా, యూఏఈ వేదికగా జరిగిన రెండో విడతలో చాహల్ అద్బుతంగా రాణించాడు. అయితే రానున్న మెగా వేలంలో చాహల్‌ను ఆర్‌సీబీ తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది అని అతడు తెలిపాడు. ఈ వేలంలో చాహల్‌ను దక్కించుకోవడానికి చాలా జట్లు తీవ్రమైన పోటీ పడతాయి అని అతడు తెలిపాడు.
" ఆర్‌సీబీ చాహల్‌ని తిరిగి దక్కించుకోవడానికి ప్రత్నిస్తుంది. ఐపీఎల్‌లో అతని అసాధారణ రికార్డు కారణంగా ఇతర జట్లు కూడా చాహల్ కోసం తీవ్రమైన పోటీపడతాయి. కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీలు ఎక్కువ మెత్తం వెచ్చించి అతడిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. చాహల్ రీటైన్ చేసుకునే మెత్తం కంటే.. వేలంలో ఇంకా ఎక్కువ ధర పొందవచ్చు అని అతడు పేర్కొన్నాడు. ఇక యువ క్రికెటర్‌లు గురించి మాట్లాడుతూ.. ఆటగాళ్లందరూ తమ దేశం కోసం ఆడడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని అని శివరామకృష్ణన్ సూచించాడు.
చదవండి: Rashid Khan: 16 కోట్లు కావాలని పట్టుబట్టాడు!.. అయితే.. అంతకంటే ఎక్కువకే మరి!
Comments
Please login to add a commentAdd a comment