ఐపీఎల్-2022 మెగా వేలాన్ని బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. అయితే ఈ మెగా వేలంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో వేలానికి సరికొత్త ప్రాధన్యత సంతరించుకొంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఆర్సీబీ యుజువేంద్ర చాహల్‌ను రీటైన్ చేసుకోలేదు. కాగా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని చాహల్ అందుకున్నాడు. కాగా మ్యాచ్ అనంతరం చాహల్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేశాడు.
దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో వన్డే క్రికెట్‌లో 100 వికెట్లు పూర్తి చేసినందుకు చాహల్‌ను రోహిత్ అభినందించాడు. ఇక 100 వికెట్లు పడగొట్టడం ఎలా అనిపిస్తుంది అని రోహిత్ ప్రశ్నించగా.. "నాకు ఈ ఘనత సాధించడం చాలా గర్వంగా ఉంది. నేను ఇంత వేగంగా ఈ ఘనత సాధిస్తానని ఎప్పుడూ ఊహించలేదు" అని చాహల్ బదులు ఇచ్చాడు. ఇక ఫుల్ టైమ్ వైట్-బాల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక రాబోయే వేలంలో చాహల్‌కి రోహిత్ ఆల్‌ది బెస్ట్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment