టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చహల్ బౌలర్‌గా అందరికీ సుపరిచితుడు. అయితే ఇతనిలో ఓ బ్యాటర్ దాగి ఉన్నాడన్న విషయం ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచానికి తెలుస్తుంది. బక్క పలచని శరీరాకృతి కలిగిన చహల్ ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇది చూసి అతని అభిమానులు ఔరా అంటున్నారు.
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో చహల్ 152 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేశాడు. తాజాగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 142 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. వేదిక ఏదైనా ఎప్పుడూ ఇంతటి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడని చహల్ ఒక్కసారిగా ప్రొఫెషనల్ బ్యాటర్‌లా మారిపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. టీమిండియాకు నయా ఆల్‌రౌండర్ దొరికాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, రంజీల్లో హర్యానాను ప్రాతినిథ్యం వహించే చహల్ తాజాగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన చహల్.. తొమ్మిదో నంబర్ ఆటగాడు హర్షల్ పటేల్‌తో (72 నాటౌట్) కలిసి దాదాపు 300 బంతులు ఎదుర్కొన్నాడు.
హర్షల్, చహల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో మధ్యప్రదేశ్‌పై హర్యానా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేయగా.. హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా 123 ఆధిక్యంలో ఉంది. హర్షల్ పటేల్‌తో పాటు అమన్ కుమార్ (4) క్రీజ్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment