
PC: IPL.com
ఐపీఎల్-2022 లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు అనుజ్ రావత్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన కాష్ దీప్ బౌలింగ్‌లో.. లియామ్ లివింగ్‌స్టోన్ ఆఫ్‌సైడ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అది మిస్‌టైమ్ అయింది. దీంతో ఆఫ్‌సైడ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రావత్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
రావత్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో లివింగ్‌స్టోన్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లు ఆందుకున్న రావత్.. పంజాబ్ బ్యాటర్ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వదిలివేయడం గమనార్హం. ఈ క్యాచ్ వదిలి వేయడంతో స్మిత్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
సిరాజ్ వేసిన 18వ ఓవర్‌లో స్మిత్ ఏకంగా 25 పరుగులు రాబట్టి పంజాబ్‌కు విజయం అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్(88),విరాట్ కోహ్లి (41) చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32), శిఖర్ ధవన్ (43), భానుక రాజపక్స (43),ఒడియన్ స్మిత్(25) పరుగులతో రాణించారు.
చదవండి: IPL 2022: సన్‌రైజర్స్ బౌలర్‌కు పూరన్ ఓపెన్ చాలెంజ్! ప్లాన్ ఫెయిల్ కావడంతో..
Comments
Please login to add a commentAdd a comment