ఐపీఎల్-2022 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు అరంగేట్రం చేయడంతో లీగ్ మరింత రసవత్తరంగా జరగనుంది. అయితే ఐపీఎల్-2022 సీజన్ కోసం ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్ప అన్ని ఫ్రాంచైజీలు కెప్టెన్‌లు నియమించుకున్నాయి. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్సీ రేసులో మాక్స్‌వెల్, డు ప్లెసిస్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మాక్స్‌వెల్ తన వివాహం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండటంతో డు ప్లెసిస్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అంతా భావిస్తున్నారు.
అయితే అనూహ్యంగా దినేష్ కార్తీక్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆర్సీబీ మెనేజేమెంట్ కార్తీక్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.వేలానికి ముందు విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను ఆర్‌సీబీ రిటైన్ చేసుకుంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆర్సీబీ కార్తీక్‌ను రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఐపీఎల్ 2022 షెఢ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నైతో కేకేఆర్ తలపడనుంది.
చదవండి: IPL 2022: 'కోహ్లి మళ్లీ కెప్టెన్ కాలేడు.. ఆర్సీబీ కెప్టెన్‌గా అతడే సరైనోడు'
Comments
Please login to add a commentAdd a comment