
హైదరాబాద్ : దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరుతున్నాడా? అంటే అవుననే అంటున్నారు ఆ జట్టు అభిమానులు. స్టెయిన్ ఐపీఎల్ 2019 సీజన్‌లో ఆడటానికే భారత్‌కు వస్తున్నాడని ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇండియా వీసాకు సంబంధించిన ఫొటోను స్టెయిన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అహ్హా.. ఏంటీ ఈ సర్‌ప్రైజ్’ అనే క్యాఫ్షన్‌తో షేర్ చేయడంతో ఈ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ఆర్సీబీ చెత్త రికార్డును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడి అభిమానులకు తీరని మనోవ్యథను మిగిల్చింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో స్టెయిన్ జట్టులో చేరితే ఆర్సీబీకి కలుసోస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాథన్‌కౌల్టర్ నీల్ స్థానంలో స్టెయిన్ తుదిజట్టులోకి వస్తునట్లు ప్రచారం చేస్తున్నారు. తమకు మంచిరోజులు రాబోతున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక స్టెయిన్ ఆర్సీబీ జట్టులో చేరితే ఆ జట్టుకు కలిసొచ్చే అంశమే. గత ఆరు మ్యాచ్‌ల్లో వారి బౌలింగ్ విభాగం తేలిపోయింది. భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేక ఆ జట్టు చేతులెత్తేసింది. ముఖ్యంగా ఆ జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ లేక పరాజయాలను చవిచూసింది. ఒకవేళ స్టెయిన్ జట్టులో చేరితే మాత్రం ఆ లోటు తీరనుంది. ఇక 2008 సీజన్ నుంచి 2010 వరకు స్టెయిన్ ఆర్సీబీ జట్టుకే ప్రాతినిథ్యం వహించాడు. 2011లో డెక్కన్ చార్జెర్స్ తరపున ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్ల తరఫున కూడా బరిలోకి దిగాడు. ఇక ఈ విషయంపై ఆర్సీబీ జట్టు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. స్టెయిన్ జట్టులో చేరే అవకాశం లేదని మాత్రం చెప్పలేమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలయర్స్ జట్టులో ఉండటంతో స్టెయిన్ రాకను కొట్టిపారేయలేమంటున్నారు.
Dale Steyn to join RCB tomorrow
— Merin Kumar ™ (@merin_kumar) April 11, 2019
Comments
Please login to add a commentAdd a comment