
బెంగళూరు: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ డేల్ స్టెయిన్ భుజం గాయం కారణంగా మిగతా లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి నాలుగు వికెట్లు సాధించిన స్టెయిన్‌కు భుజం గాయం తిరగబెట్టడంతో ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆర్సీబీ చైర్మన్ సంజీవ్ చురివాలి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఐపీఎల్ ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసిన ఆర్సీబీ.. హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
ఈ దశలో ప్రధాన పేసర్ స్టెయిన్ దూరం కావడంతో ఆర్సీబీకి ప్రధాన లోటుగానే చెప్పొచ్చు. నాథన్ కౌల్టర్ నైల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన స్టెయిన్ కూడా అదే దారిలో పయనించడం ఆర్సీబీని ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు సైతం స్టెయిన్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment