
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్వాలేదనిపిస్తుంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ ఏడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. కాగా గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 67 పరుగుల తేడాతో ఆర్‌సీబీ విజయం సాదించి , ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ ఏడాది సీజన్‌లో ఆర్‌సీబీ ఆటతీరుపై భారత మాజీ క్రికెటర్‌లు వసీం జాఫర్, దీప్ దాస్‌గుప్తా తాజగా ఓ స్పోర్ట్స్ షోలో చర్చించారు.
ఆర్‌సీబీ కొంతమంది ఆటగాళ్లపై ఆధారపడటం లేదని, జట్టు మొత్తం సమిష్టంగా రాణిస్తోందని దీప్ దాస్‌గుప్తా తెలిపాడు. "టోర్నమెంట్ ప్రారంభంలో అనుకున్నట్టుగా ఆర్సీబీ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపై ఆధారపడడంలేదు. జట్టు మొత్తం సంయుక్తంగా రాణిస్తోంది. అందుకే వారు పాయింట్ల పట్టికలో ఈ స్థానంలో ఉన్నారు. వారు ప్లేఆఫ్‌కు ఆర్హత సాధించడానికి ఒక్క విజయం దూరంలో ఉన్నారు. ఇక ఆర్సీబీ తమ చివర మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు" అని దీప్ దాస్‌గుప్తా పేర్కొన్నాడు.
చదవండి:IPL 2022: 'ఉమ్రాన్ మాలిక్ పాకిస్తాన్‌లో ఉండి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడు'
Comments
Please login to add a commentAdd a comment