Dasgupta
-
'వారిద్దరూ త్వరలోనే భారత జట్టులోకి వస్తారు'
చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్లు ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్ త్వరలోనే భారత జట్టులోకి వస్తారని టీమిండియా మాజీ వికెట్ కీపర్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది సీజన్లో ఈ ఇద్దరు పేసర్లు పర్వాలేదనిపిస్తున్నారు. ముఖ్యంగా ముఖేష్ తన పేస్ బౌలింగ్‌తో పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. "చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలను ఇస్తుంది. ఆటగాళ్లను అద్భుతంగా తయారు చేయడంలో సీఎసేకు ఎవరూ సాటి లేరు. ధోని దీపక్ చాహర్‌ను ఏ విధంగా అయితే తీర్చిదిద్దాడో.. ముఖేష్ చౌదరిని కూడా అదే విధంగా తయారు చేస్తాడు. ఇక సిమర్జీత్ బౌలింగ్‌లో కూడా బాగా మెరుగు పడ్డాడు. అతడు అద్భుతంగా లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేస్తాడు. రాబోయే సీజన్లలో వీరిద్దరూ సీఎస్కేకు పేస్ బౌలర్లుగా ఉంటారు. ఇక త్వరలోనే భారత జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను" అని దాస్‌గుప్తా పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: సైమండ్స్ మృతికి సంతాపం.. నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగిన గుజరాత్, చెన్నై ఆటగాళ్లు.. -
'ఆర్సీబీ అద్భుతంగా ఆడుతోంది.. ప్లే ఆఫ్‌కు ఒక్క మ్యాచ్ దూరంలో'
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్వాలేదనిపిస్తుంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఏడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. కాగా గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 67 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాదించి , ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ఆటతీరుపై భారత మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, దీప్ దాస్‌గుప్తా తాజగా ఓ స్పోర్ట్స్ షోలో చర్చించారు. ఆర్సీబీ కొంతమంది ఆటగాళ్లపై ఆధారపడటం లేదని, జట్టు మొత్తం సమిష్టంగా రాణిస్తోందని దీప్ దాస్‌గుప్తా తెలిపాడు. "టోర్నమెంట్ ప్రారంభంలో అనుకున్నట్టుగా ఆర్సీబీ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపై ఆధారపడడంలేదు. జట్టు మొత్తం సంయుక్తంగా రాణిస్తోంది. అందుకే వారు పాయింట్ల పట్టికలో ఈ స్థానంలో ఉన్నారు. వారు ప్లేఆఫ్‌కు ఆర్హత సాధించడానికి ఒక్క విజయం దూరంలో ఉన్నారు. ఇక ఆర్సీబీ తమ చివర మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు" అని దీప్ దాస్‌గుప్తా పేర్కొన్నాడు. చదవండి:IPL 2022: 'ఉమ్రాన్ మాలిక్ పాకిస్తాన్లో ఉండి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడు' -
"అతడు అద్భుతమైన బౌలర్.. త్వరలోనే భారత జట్టులోకి వస్తాడు"
పంజాబ్ కింగ్స్ యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను భారత మాజీ ఆటగాడు దీప్ దాస్‌గుప్తా ప్రశంసించాడు. అర్ష్‌దీప్ సింగ్ తన అద్భుతమైన ప్రదర్శనతో త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని అతడు అభిప్రాయ పడ్డాడు. "అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. భారత జట్టులో లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ తక్కువగా ఉన్నారు. కాగా మరో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నటరాజన్ కూడా అద్భుమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే అర్ష్‌దీప్ గత రెండు సీజన్ల నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి రానున్న టీ20 సిరీస్‌లతో పాటు టీ20 ప్రపంచకప్ భారత జట్టులో కూడా అర్ష్‌దీప్‌కు చోటు దక్కుతుందని నేను భావిస్తున్నాను" అని దీప్ దాస్‌గుప్తా పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2022లో అర్ష్‌దీప్ పెద్దగా వికెట్లు సాధించకపోయినా.. కట్టు దిట్టంగా బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రెండు డెత్ ఓవర్లు వేసిన అర్ష్‌దీప్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక గతేడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ 18 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ అతడే: టీమిండియా మాజీ క్రికెటర్ -
సరోద్ పండితుడు దాస్‌గుప్తా కన్నుమూత
కోల్‌కతా: సరోద్ పండితుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా(84) దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన ఆయన కొద్ది రోజులుగా శ్వాససంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దాస్‌గుప్తా మృతి ఆ రంగానికి తీరని లోటని పేర్కొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1933లో బీహార్ రాష్ట్రంలోని భాగల్పూరు ఆస్పత్రిలో జన్మించారు. పండిట్ రాధికా మోహన్ మోయిత్రా వద్ద సరోద్ నేర్చుకున్నారు. 2015లో సంగీత్ మహాసమ్మాన్, బంగాబిభూషణ్ బిరుదులు పొందారు. ఆయన తండ్రి ప్రఫుల్ల మోహన్ దాస్‌గుప్తా జిల్లా మేజిస్ట్రేట్ మాత్రమేగాక సంగీతంలో ప్రజ్ఞాశాలి. బుద్ధదేవ్ దాస్‌గుప్తా చిన్న కుమారుడు యూ.ఎస్ నుంచి వచ్చాక బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. -
రూ. 17,000 కోట్ల ఆదాయం!
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వైజాగ్ కస్టమ్స్ జోన్ రూ. 17,000 కోట్ల ఆదాయాన్ని అంచనావేస్తోంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం రేవులు ఈ జోన్ పరిధిలో వున్నాయి. 2012-13లో రూ. 15, 373 కోట్ల ఆదాయాన్ని ఈ జోన్ వసూలు చేయగలిగింది. ఈ అంశాల్ని చీఫ్ కమిషనర్ ఆఫ్ కష్టమ్స్ ఎక్జైజ్ అండ్ సర్వీస్ టాక్స్ (విశాఖ జోన్) దీపా బి.దాస్‌గుప్తా వివరిస్తూ గత ఏడాది ఎగుమతులు ఆశించిన స్థాయిలో జరిగాయన్నారు. శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్టు ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఇఓ), వైజాగ్ పటం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్రీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా ఆమె మాట్లాడుతూ ఆర్ధిక మందగమనంలో ఉన్నా ఎగుమతులు బాగా జరుగుతున్నాయన్నారు. కమిషనర్ ఆఫ్ కష్టమ్స్ (వైజాగ్-1) సి.రాజేందిరన్ మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు రూ.22,900కోట్లు ఎగుమతులు జరిగాయన్నారు. అంతకుముందు ఏడాది రూ.14,991 కోట్లు ఎగుమతులు జరిగాయన్నారు. ఇనుప ఖనిజం ఎగుమతులు బాగా పెరిగాయన్నారు.