విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వైజాగ్ కస్టమ్స్ జోన్ రూ. 17,000 కోట్ల ఆదాయాన్ని అంచనావేస్తోంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం రేవులు ఈ జోన్ పరిధిలో వున్నాయి. 2012-13లో రూ. 15, 373 కోట్ల ఆదాయాన్ని ఈ జోన్ వసూలు చేయగలిగింది. ఈ అంశాల్ని చీఫ్ కమిషనర్ ఆఫ్ కష్టమ్స్ ఎక్జైజ్ అండ్ సర్వీస్ టాక్స్ (విశాఖ జోన్) దీపా బి.దాస్‌గుప్తా వివరిస్తూ గత ఏడాది ఎగుమతులు ఆశించిన స్థాయిలో జరిగాయన్నారు.
శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్టు ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఇఓ), వైజాగ్ పటం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్రీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా ఆమె మాట్లాడుతూ ఆర్ధిక మందగమనంలో ఉన్నా ఎగుమతులు బాగా జరుగుతున్నాయన్నారు. కమిషనర్ ఆఫ్ కష్టమ్స్ (వైజాగ్-1) సి.రాజేందిరన్ మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు రూ.22,900కోట్లు ఎగుమతులు జరిగాయన్నారు. అంతకుముందు ఏడాది రూ.14,991 కోట్లు ఎగుమతులు జరిగాయన్నారు. ఇనుప ఖనిజం ఎగుమతులు బాగా పెరిగాయన్నారు.
రూ. 17,000 కోట్ల ఆదాయం!
Published Sat, Jan 11 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement