
Courtesy: IPL Twitter
చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్లు ముఖేష్ చౌదరి, సిమర్‌జీత్ సింగ్ త్వరలోనే భారత జట్టులోకి వస్తారని టీమిండియా మాజీ వికెట్ కీపర్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది సీజన్‌లో ఈ ఇద్దరు పేసర్లు పర్వాలేదనిపిస్తున్నారు. ముఖ్యంగా ముఖేష్ తన పేస్ బౌలింగ్‌తో పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. "చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలను ఇస్తుంది.
ఆటగాళ్లను అద్భుతంగా తయారు చేయడంలో సీఎసేకు ఎవరూ సాటి లేరు. ధోని దీపక్ చాహర్‌ను ఏ విధంగా అయితే తీర్చిదిద్దాడో.. ముఖేష్ చౌదరిని కూడా అదే విధంగా తయారు చేస్తాడు. ఇక సిమర్‌జీత్ బౌలింగ్‌లో కూడా బాగా మెరుగు పడ్డాడు. అతడు అద్భుతంగా లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేస్తాడు. రాబోయే సీజన్‌లలో వీరిద్దరూ సీఎస్‌కేకు పేస్ బౌలర్లుగా ఉంటారు. ఇక త్వరలోనే భారత జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను" అని దాస్‌గుప్తా పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: సైమండ్స్ మృతికి సంతాపం.. నల్ల బ్యాండ్‌లతో బరిలోకి దిగిన గుజరాత్, చెన్నై ఆటగాళ్లు..