BIG Blow For CSK, Mukesh Choudhary Unlikely To Play For IPL 2023 - Sakshi
Sakshi News home page

IPL 2023: తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. కీలక బౌలర్‌ దూరం!

Published Sat, Mar 25 2023 5:18 PM | Last Updated on Sat, Mar 25 2023 6:13 PM

BIG blow for CSK, Mukesh Choudhary unlikely for IPL 2023 - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు లెఫ్టార్మ్ పేసర్ ముఖేష్‌ చౌదరి వెన్ను గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ముఖేష్‌ చౌదరి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ముఖేష్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు.

ఈ క్రమంలోనే అతడు ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతేడాది ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన  ముఖేష్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌-2022లో 13 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్‌.. 16 వికెట్లు సాధించాడు. జట్టులో దీపక్‌ చాహర్‌ లేని లోటును ముఖేష్‌ భర్తీ చేశాడు. పవర్‌లో ప్లేలో అద్భుతంగా బౌలింగ్‌ చేసి సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఇక ఇప్పటికే ఈ ఏడాది సీజన్‌కు సీఎస్‌కే స్టార్‌ పేసర్‌ కైల్ జేమీసన్ కూడా దూరమయ్యాడు. ఇప్పుడు  ముఖేష్‌ చౌదరి కూడా ఫిట్‌నెస్‌ సాధించకపోవడం సీఎస్‌కేను మరింత కలవరపెడుతోంది.  ఇక ఐపీఎల్‌-16వ సీజన్‌ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు తలపడనున్నాయి.
చదవండి: KL Rahul LSG: లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ షాక్‌! కష్టమే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement