Mukesh Choudhary
-
తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు ఊహించని షాక్.. కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్-2023 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే తొలి మ్యాచ్‌కు ముందు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ ముకేష్ చౌదరి గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. రంజీల్లో ఆడుతూ గత ఏడాది చివర్లో గాయపడిన ముకేష్ చౌదరి.. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందాడు. అనంతరం ఫిట్నెస్ సాధించి ఐపీఎల్-2023 కోసం సీఎస్కే జట్టుతో చేరాడు. అయితే నెట్స్‌లో బౌలింగ్ చేసిన ముకేష్ చౌదరి గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఈ ఏడాది ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. గత ఏడాది సీజన్లో సీఎస్కే తరపున ముఖేష్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 13 మ్యాచ్‌లాడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 16 వికెట్లు పడగొట్టాడు. ముకేష్ స్థానంలో ఆకాష్ సింగ్ ఇక గాయపడిన ముకేష్ స్థానంలో రాజస్తాన్ యువ పేసర్ ఆకాష్ సింగ్‌ను సీఎస్కే మెనెజ్‌మెంట్ భర్తీ చేసింది. ఆకాష్ సింగ్‌ను రూ.20లక్షల కనీస ధరకు చెన్నై సొంతంచేసుకుంది. గతంతో రాజస్తాన్ రాయల్స్ తరుపున ఆకాష్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అదే విధంగా 2020 భారత అండర్-19 ప్రపంచకప్ జట్టులో కూడా ఆకాష్ భాగంగా ఉన్నాడు. ఇక దేశీవాళీ క్రికెట్లో 23 మ్యాచ్‌లు ఆడిన అతడు 31 వికెట్లు పడగొట్టాడు. -
తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం!
ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు లెఫ్టార్మ్ పేసర్ ముఖేష్ చౌదరి వెన్ను గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ముఖేష్ చౌదరి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ముఖేష్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతేడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన ముఖేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2022లో 13 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్.. 16 వికెట్లు సాధించాడు. జట్టులో దీపక్ చాహర్ లేని లోటును ముఖేష్ భర్తీ చేశాడు. పవర్లో ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పటికే ఈ ఏడాది సీజన్‌కు సీఎస్కే స్టార్ పేసర్ కైల్ జేమీసన్ కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ముఖేష్ చౌదరి కూడా ఫిట్నెస్ సాధించకపోవడం సీఎస్కేను మరింత కలవరపెడుతోంది. ఇక ఐపీఎల్-16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: KL Rahul LSG: లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్! కష్టమే.. -
సీఎస్కే బౌలర్‌కు బంపర్ ఆఫర్.. టీమిండియాతో పాటుగా ఆస్ట్రేలియాకు!
టీ20 ప్రపంచకప్-2022 కోసం టీమిండియా అక్టోబర్ 6న ఆస్ట్రేలియాకు పయనం కానుంది. జస్ప్రీత్ బుమ్రా మినహా 15 మందితో కూడిన భారత బృందం ఈ మెగా ఈవెంట్‌కు వారం రోజుల ముందే కంగారూల గడ్డపై అడుగుపెట్టనుంది. అదే విధంగా స్టాండ్ బై ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ ఆక్టోబర్ 12న ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తలపడే భారత జట్టులో భాగంగా ఉన్నారు. కాగా ప్రాధాన జట్టుతో పాటు నెట్ బౌలర్లు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ వంటి పేస్ బౌలర్లను నెట్ బౌలర్లగా బీసీసీఐ ఎంపిక చేయగా.. తాజాగా మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను కూడా నెట్ బౌలర్లగా ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్‌స్టార్ నివేదిక ప్రకారం.. ఈ బౌలర్ల జాబితాలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి, చేతన్ సకారియా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ముఖేష్ చౌదరి అద్భతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖేష్ ప్రస్తుతం పూణేలో శిక్షణ పొందుతుండగా.. ఉమ్రాన్, సకారియా, కుల్దీప్ సేన్ ఇరానీ కప్‌లో ఆడుతున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న దాయాది జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ , జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. కోహ్లికి రెస్ట్! శ్రేయస్‌కు ఛాన్స్ -
'ధోని భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా'
ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే సీఎస్కే పేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ.. ఆ జట్టు యువ ఆటగాళ్లు ముఖేష్ చౌదరి, సిమ్రంజీత్ సింగ్ తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా సీఎస్కే టివీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ కెప్టెన్ ఎంస్ ధోనిపై సిమ్రంజీత్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టులోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించి వారిని సిద్ధం చేయడంలో ధోని కీలక పాత్ర పోషిస్తాడని సిమ్రంజీత్ తెలిపాడు. ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన సిమ్రంజీత్ 4 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ రేటు 7.67గా ఉంది. "ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎలా ఉండాలో మహి భాయ్ నుంచి నేర్చుకున్నాను. నేను బౌలింగ్ చేసేటప్పడు ధోని నాకు ఎప్పుడూ సలహాలు ఇస్తూ ఉంటాడు. అదే విధంగా బౌలింగ్‌ను మెరుగ్గా చేయమని నన్ను ప్రోత్సహించాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో నేను బాగా బౌలింగ్ చేశానని మహి భాయ్ చెప్పాడు. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎస్ఆర్హెచ్తో నా తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో నేను భయపడలేదు. అయితే మ్యాచ్ మధ్యలో కాస్త ఒత్తిడికి గురయ్యాను. నేను ప్రేక్షకుల మధ్య తొలి సారిగా స్టేడియంలోకి అడుగుపెట్టినప్పుడు కొత్తగా అనిపించింది. బెంచ్‌పై కూర్చోవడానికి, ప్లేయింగ్ ఎలెవెన్‌లో భాగం కావడానికి చాలా తేడా ఉంది" అని సిమ్రంజీత్ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SA: 'రోహిత్ శర్మకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్ధం కావడం లేదు' -
'వారిద్దరూ త్వరలోనే భారత జట్టులోకి వస్తారు'
చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్లు ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్ త్వరలోనే భారత జట్టులోకి వస్తారని టీమిండియా మాజీ వికెట్ కీపర్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది సీజన్లో ఈ ఇద్దరు పేసర్లు పర్వాలేదనిపిస్తున్నారు. ముఖ్యంగా ముఖేష్ తన పేస్ బౌలింగ్‌తో పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. "చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలను ఇస్తుంది. ఆటగాళ్లను అద్భుతంగా తయారు చేయడంలో సీఎసేకు ఎవరూ సాటి లేరు. ధోని దీపక్ చాహర్‌ను ఏ విధంగా అయితే తీర్చిదిద్దాడో.. ముఖేష్ చౌదరిని కూడా అదే విధంగా తయారు చేస్తాడు. ఇక సిమర్జీత్ బౌలింగ్‌లో కూడా బాగా మెరుగు పడ్డాడు. అతడు అద్భుతంగా లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేస్తాడు. రాబోయే సీజన్లలో వీరిద్దరూ సీఎస్కేకు పేస్ బౌలర్లుగా ఉంటారు. ఇక త్వరలోనే భారత జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను" అని దాస్‌గుప్తా పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: సైమండ్స్ మృతికి సంతాపం.. నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగిన గుజరాత్, చెన్నై ఆటగాళ్లు..