
పంజాబ్ కింగ్స్ యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను భారత మాజీ ఆటగాడు దీప్ దాస్‌గుప్తా ప్రశంసించాడు. అర్ష్‌దీప్ సింగ్ తన అద్భుతమైన ప్రదర్శనతో త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని అతడు అభిప్రాయ పడ్డాడు. "అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. భారత జట్టులో లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ తక్కువగా ఉన్నారు. కాగా మరో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నటరాజన్ కూడా అద్భుమైన ఫామ్‌లో ఉన్నాడు.
అయితే అర్ష్‌దీప్ గత రెండు సీజన్ల నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి రానున్న టీ20 సిరీస్‌లతో పాటు టీ20 ప్రపంచకప్ భారత జట్టులో కూడా అర్ష్‌దీప్‌కు చోటు దక్కుతుందని నేను భావిస్తున్నాను" అని దీప్ దాస్‌గుప్తా పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2022లో అర్ష్‌దీప్ పెద్దగా వికెట్లు సాధించకపోయినా.. కట్టు దిట్టంగా బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రెండు డెత్ ఓవర్లు వేసిన అర్ష్‌దీప్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక గతేడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ 18 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2022: ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ అతడే: టీమిండియా మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment