PC: IPL
సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రక...
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక�...
అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబో�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ము�...
‘‘కష్టం నాన్నా.. నాకు ఇవేం అర్థం కావడం...
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ముఖ్యమంత�...
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక...
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఉన్న అటవీ ప్�...
అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వ...
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్...
జైపూర్: రాజస్థాన్‌లోని ఓ పెట్రోల్ �...
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్దీప�...
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదే�...
Published Tue, Apr 26 2022 7:03 PM | Last Updated on Tue, Apr 26 2022 11:24 PM
PC: IPL
IPL 2022: ఆర్సీబీపై రాజస్తాన్ రాయల్స్ ఘనవిజయం
రాజస్తాన్ 29 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రియాన్ పరాగ్ (31 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు.
అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ డుప్లెసిస్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. కుల్దీప్ సేన్ (4/20) రాణించగా, అశ్విన్ 3 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు.
92 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన షబాజ్ ఆహ్మద్..అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి ఇంకా 24 బంతుల్లో 51 పరుగులు కావాలి.
15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో షబాజ్ ఆహ్మద్(17),హాసరంగా(8) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ విజయానికి ఇంకా 27 బంతుల్లో 55 పరుగులు కావాలి.
66 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేపిన ప్రభుదేశాయి.. అశ్విన్ బౌలింగ్‌లో పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి 48 బంతుల్లో 78 పరుగులు కావాలి. క్రీజులో కార్తీక్, షబాజ్ ఆహ్మద్ ఉన్నారు.
58 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన పటిదార్.. అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కోహ్లి(9),డుప్లెసిస్(23),మాక్స్వెల్ డకౌట్ అయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, సిరాజ్, హాసరంగా చెరో రెండు వికెట్లు,హర్షల్ పటేల్ ఒక్క వికెట్ సాధించాడు.
103 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 3 పరుగలు చేసిన హెట్‌మైర్.. హాసరంగా బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లకు రాజస్తాన్ రాయల్స్ స్కోర్ 110/ 6
99 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన మిచెల్.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
68 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శాంసన్.. హాసరంగా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
33 పరుగలకే మూడు రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో అశ్విన్ ఔట్ కాగా, హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ పెవిలియన్‌కు చేరాడు.4 ఓవర్లకు రాజస్తాన్ రాయల్స్ స్కోర్: 33/3
11 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగలు చేసిన పడిక్కల్.. సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో బట్లర్, అశ్విన్ ఉన్నారు. 2 ఓవర్లకు రాజస్తాన్ రాయల్స్ స్కోర్ 19/1
ఐపీఎల్-2022లో రాయల్స్ పోరుకు రంగం సిద్దమైంది. ఏంసీఏ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
ఆర్సీబీ
ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
రాజస్తాన్ రాయల్స్
జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, డారిల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
Comments
Please login to add a commentAdd a comment